Pawan Kalyan
తమిళనాడు మధురైలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్న మురుగ భక్తర్గళ్ మానాడుకు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan
తెలుగు నేల నుంచి వచ్చిన అతిథిగా కాకుండా, మురుగ భక్తునిగా పవన్ చూపించిన గౌరవం, వినయం మానాడులో పాల్గొన్న వారందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.
Pawan Kalyan
పారంపర్య తమిళ దుస్తులు, దక్షిణాది సంస్కృతి ప్రతిబింబించే శైలిలో ఉన్న ఆయన దుస్తులుండటం విశేషం. మురుగ భక్తులు ధరించే శ్వేత వస్త్రాల్లో పవన్ కనిపిస్తూ.. వేదికపైకి వచ్చినప్పుడు ఆత్మీయంగా అభివాదం చేయడం సభలో హర్షం కలిగించింది.
Pawan Kalyan
వేదికపైకి అడుగుపెట్టగానే పవన్ కళ్యాణ్ మానాడులో పాల్గొన్న మురుగ భక్తులకు పాదాభివందనం చేయడం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.
Pawan Kalyan
ఆయన చర్య అందరి గుండెల్లో గౌరవాన్ని కలిగించింది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా వినయపూర్వకంగా నమస్కరించడం మానవత్వానికి ప్రతిబింబంగా పలువురు అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ మానాడులో పాల్గొనడం అంతటితో ముగియలేదు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భజన, శివనామ సంకీర్తన, ఇతర ఆధ్యాత్మిక పరిచర్యల్లో ఆయన ఆసక్తిగా పాల్గొన్నారు.
Pawan Kalyan
మురుగ భక్తుల ఆశయాలను అర్థం చేసుకునేలా ఆయన మానవతా స్పర్శను కలిగించిన తీరు ప్రస్థావనీయమైనది. ఈ సందర్బంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వినయంగా నిలుచున్న పవన్ కళ్యాణ్, మురుగ భక్తులకు నమస్కరిస్తున్న దృశ్యాలు, పారంపర్య దుస్తుల్లో ఆయన చిరునవ్వు అన్నీ అభిమానులను అలరిస్తున్నాయి.
Pawan Kalyan
ఈ గ్యాలరీ ద్వారా మధురై మానాడులో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక భాగస్వామ్యం, తమిళ భక్తులతో కలిసిన అనుబంధం, దక్షిణాది సంస్కృతిపై ఆయన గౌరవం స్పష్టమవుతాయి.
Pawan Kalyan
జనసేనాని రాజకీయ నేతగా మాత్రమే కాకుండా ఒక మానవతావాది, భక్తునిగా కూడా ప్రజల్లో మరింత చేరువయ్యేలా ఉన్నారని జనసేన క్యాడర్, హిందూ సంఘాలు కొనియాడుతున్నాయి.