Kadapa: కడపలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్ లో అనారోగ్యంగా ఉండటంతో మేనేజ్ మెంట్ రిమ్స్‌కు తరలించింది. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారంటున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తెను యాజమాన్యం చంపిందని ఆరోపిస్తున్నారు.
కడప జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జస్వంతి అనుమానాస్పద మృతిపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా అనారోగ్యంతో కళ్లు తిరిగి కింద పడింది ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు.. మళ్లీ వెంటనే ఊరి వేసుకుని చనిపోయిందని అని సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు మా అమ్మాయి ఎందుకు ఊరి వేసుకుంది.. నా కూతురు ఎంతో ధైర్యంగా ఉంటూ.. చదువులో ఎంతో చురుకుగా ఉంటుంది. అయినప్పటికి అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పిరికిది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతిని అనుమానిస్తున్నారు.
Also Read: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..
అయితే అక్కడ స్కూల్‌లో రూమ్‌లోకి పిల్లల్ని ఒక్కర్ని పంపించరు కాని, మా కూతురిని ఒక్కదాన్నే ఎలా పంపిచారు. అంటే వాళ్లే తీసుకెళ్ళి మా అమ్మాయిని చంపేశారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.