టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. ఆకట్టుకునే ఆఫర్ల పేరుతో apk ఫైల్స్ పంపిస్తున్నారు. మొబైల్ యూజర్లు వాటిని క్లిక్ చేయగానే ఆటో మేటిక్ గా డివైజ్ కంట్రోల్ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. బ్యాంక్ వివరాలను హ్యాక్ చేసి, అందులోని డబ్బులను కొట్టేస్తున్నారు. ఇక ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఉంటే, వాటిని చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే, apk లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
apk ఫైల్ అనేది Android మొబైల్ ఫోన్లలో యాప్ లను ఇన్ స్టాల్ చేయడానికి ఉపయోగించే ఒక రకమైన ఫైల్. దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్, టాబ్లెట్ లో సైబర్ కేటుగాళ్లు పంపిన యాప్ ను ఆటో మేటిక్ గా క్లిక్ అవుతుంది. దాని ద్వారా సదరు వ్యక్తి డివైజ్ లోని డేటా అంతా సైబర్ కేటుగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఇవి అత్యంత డేంజర్ పైల్స్.
⦿ మాల్వేర్ ప్రమాదం: తెలియని, నమ్మదగని వెబ్ సైట్ల నుంచి apk ఫైల్ వైరస్ లు, స్పైవేర్, రాన్సమ్ వేర్ లాంటి ప్రమాదకరమైన సాఫ్ట్ వేర్ ను కలిగి ఉండవచ్చు. ఇవి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. మీ డివైజ్ ను దెబ్బతీస్తాయి. మీ ఫైల్స్ ను లాక్ చేసే అవకాశం ఉంటుంది.
⦿ అన్ నౌన్ సోర్సెస్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే యాప్స్ భద్రత కోసం చెక్ చేయబడుతాయి. కానీ, గుర్తు తెలియని వెబ్ సైట్లకు సంబంధించిన apk ఫైల్స్ అలా ఉండకపోవచ్చు. హ్యాకర్లు, స్కామర్లు తరచుగా వినియోగదారులను హానికరమైన యాప్ లను డౌన్ లోడ్ చేసుకునేలా చేసి, మోసం చేసేందుకు ఈ ఫైల్స్ ను ఉపయోగిస్తారు.
⦿ సేఫ్టీ సెట్టింగ్ ల ప్రమాదం: అన్ నౌన్ సోర్సెస్ నుంచి apk ఫైల్స్ ను ఇన్ స్టాల్ చేసినప్పుడు మీ ఫోన్ డేంజర్ లో పడుతుంది. సేఫ్టీ సెట్టింగ్ లకు ప్రమాదం కలుగుతుంది.
⦿ డేటా ప్రైవసీ ప్రాబ్లమ్స్: కొన్ని apk ఫైల్స్ మీ ఫోన్ లోని కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజ్ లు ఇతర డేటానో యాక్సెస్ చేయడానికి పర్మీషన్స్ అడుతుతాయి. ఒకవేళ ఆ యాప్ హానికరమైనది అయితే.. ఈ సమాచారం అంతా డేంజర్ లో పడుతుంది.
⦿ బాగా తెలిసిన సోర్స్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి: Google Play Store, Samsung Galaxy Store లాంటి అధికారిక యాప్ స్టోర్ల నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
⦿ లింక్‌లను జాగ్రత్తగా చెక్ చేయాలి: apk ఫైల్ ను డౌన్ లోడ్ చేయడానికి లింక్ ను క్లిక్ చేసే ముందు.. వెబ్ సైట్ సేఫ్ గా ఉందని నిర్ధారించుకోవాలి. అనుమానాస్పద లింక్ ల జోలికి వెళ్లకూడదు.
⦿ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ వాడండి: మీ డిజైజ్ లో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. డౌన్ లోడ్ చేసిన తర్వాత apk ఫైల్స్ ను తెరవడానికి ముందు స్కాన్ చేయాలి.
⦿ తెలియని సోర్స్ జోలికి వెళ్లకండి: ప్రమాదకర యాప్స్ ను ఇన్ స్టాల్ చేయకుండా అడ్డుకోవడానికి Android సెట్టింగ్స్ లో అన్ నౌన్ సోర్స్ ఆప్షన్ ను ఆఫ్ లో ఉంచాలి.
Read Also: నెట్ వర్క్ లేకున్నా అవి చూసేయొచ్చు, ఆపిల్ యూజర్లకు పండగే పండుగ!