Hormuz Strait: ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ అనుకున్నంత పని చేసేలానే ఉంది. తమ దేశ అణు స్థావరాలపై అమెరికా అటాక్ చేసిన నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసే దిశగా వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ జలసంధి మూసివేతకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక సుప్రీం లీడర్ నేతృత్వంలోని కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జలసంధిలో నౌకలు అన్నీ దాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ ఈ జలసంధి మూసివేతకు గురైతే.. తీవ్ర చమురు కొరత ఏర్పడి.. ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
అత్యంత ఇరుకైన జలసంధి..
వరల్డ్ వైడ్ గా చమురు అవసరాల్లో 20 శాతానికి పైగా హర్మోజ్ జలసంది ద్వారానే వెళ్తోంది. అరేబియా సముద్రంలోని ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం- ఇరాన్ మధ్య ఉన్న చిన్న ఇరుకైన జలసంధి హర్మోజ్. అయితే ఇందులో ఓ చోట మాత్రం చాలా ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు వెడెల్పు మాత్రమే ఉంటుంది. ఈ రూట్ ద్వారా రోజు 2 కోట్ల బారెళ్ల చమురు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్, కువైట్ దేశాల నుంచి ఉత్పత్తి అయ్యే చమురు ఈ రూట్ ద్వారానే ఇతర దేశాలకు వెళ్తోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడి ఇది చాలా ముఖ్యం. 33 శాతం ఎల్ఎన్‌జీ ఈ రూట్ ద్వారానే వెళ్తోంది.
భారత్‌పై ఎఫెక్ట్..
ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం ఎఫెక్ట్ పడనుంది అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం తన అవసరాల్లో 90 శాతం ముడి చమురును విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇందులో 40 శాతానికి పైగా హర్మోజ్ జలసంధి ద్వారానే భారత్‌కు వస్తోంది. ఇప్పుడు ఇరాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వం 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువపై ప్రభావం పడనుంది నిపుణుల అంచనా.
ALSO READ: Russia: ఇరాన్‌పై అమెరికా అటాక్.. రష్యా సంచలన వ్యాఖ్యలు, ట్రంప్‌కి త్వరలోనే గట్టిగా?
ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 90 డాలర్ల వద్ద ఉంది. సౌదీ, యూఏఈ, ఇరాక్ దేశాల నుంచి భారత్ ఎక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురును తీసుకొచ్చే నౌకలు ఒమన్ – ఇరాన్ సముద్ర మార్గంలో ఉన్న హర్మోజ్ జలసంధి నుంచి వస్తుంటాయి. ప్రపంచంలోనే చాలా దేశాలు వినియోగించే ఎల్ఎన్‌జీలోనూ 20 శాతం ఇక్కడ నుంచే వెళ్తోంది. ఈ నౌకలు మొత్తం ఈ జలసంధి ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భారత్ చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.