The Great Pre Wedding Show OTT : కొన్ని సినిమాలు ఎలాంటి స్టార్ పవర్ లేకుండా థియేటర్లలోకి వచ్చి, అద్భుతమైన కథతో, ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే కామెడీతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో తాజాగా చేరిపోయిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. టాలీవుడ్ లో తిరువీర్ పేరు మారుమ్రోగేలా చేసిన సినిమా ఇది. కేవలం మౌత్ టాక్ తోనే రోజురోజుకూ మంచి కలెక్షన్లు రాబడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తున్న ఈ మూవీ కలెక్షన్స్, ఓటీటీ డీటైల్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం.
‘మసూద’, ‘పలాస’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్. ఆయన హీరోగా, టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను థియేటర్ల వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది. మొదటి సినిమానే అయినప్పటికీ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కథనం, శ్రీకాకుళం మట్టివాసనతో కూడిన కామెడీ, హీరో తిరువీర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను థియేటర్లలో తెగ ఆకట్టుకుంటున్నాయి.
నవంబర్ 7న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 0.38 లక్షల కలెక్షన్లను సాధించింది. 2వ రోజు 18% పెరిగి 0.45 లక్షలకు చేరుకుంది. వీకెండ్ సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ మూవీ 0.50 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. 3 రోజుల 1.33 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి, కలెక్షన్లపరంగా అదరగొడుతోంది ఈ చిన్న సినిమా. లిమిటెడ్ స్క్రీన్ లలో రిలీజ్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1.60 కోట్ల.కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ మూవీ బుకింగ్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి.
మరి ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ మూవీ అనుకుంటున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఏ ఓటీటీలోకి రాబోతోంది అంటే… ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 ఓటీటీ 3 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తి కాగానే, జీ5 ఓటీటీలో మూవీ లవర్స్ ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తరువాత ఓటీటీలోకి వస్తూ ఉంటాయి. కానీ ఈ మూవీని ఓటీటీలోకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. అప్పటిదాకా కితకితలు పెట్టే మూవీని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.
Read Also : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో