Film industry:దాంపత్య జీవితంలో భర్త, భార్య మాత్రమే.. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జీవితకాలం నలుగురికి ఆదర్శంగా నిలవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నమ్మిన భాగస్వామిని మోసం చేస్తూ భార్య ఉండగా లేదా భర్త ఉండగా ఇంకొకరితో సంబంధాన్ని పెట్టుకొని దాంపత్య జీవితంలో లేనిపోని ఆటంకాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది చిన్న విషయానికే గొడవపడి విడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక భార్య మాత్రం తన భర్త ఎవరితో ఎఫైర్ నడిపించారో తనకు తెలుసు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు నేరుగా చూడలేదు కాబట్టి నమ్మను అని స్టేట్మెంట్ ఇచ్చింది.. గతంలో వీరిద్దరి మధ్య విడాకులు అంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడమే కాకుండా తన భర్త పై నమ్మకాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చీటికిమాటికి విడాకులు తీసుకొని విడిపోయే ఈ రోజుల్లో తన భర్త గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను అంటూ కొట్టి పారేసింది ఆ హీరో భార్య. వారెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ జంట గోవింద.. ఆయన భార్య సునీత ఆహుజా. తాజాగా ఒక పాడు కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన భర్త రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. “మనిషి చిన్నతనంలో తప్పులు చేయడం సహజం. నేను చేశాను. గోవిందా కూడా చేశాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఆ తప్పులు చేయడం కరెక్ట్ కాదు కదా.. ఒక మనిషికి భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తారు?” అంటూ ప్రశ్నించారు. “నిజం చెప్పాలంటే నా జీవితంలో గోవిందా నాతో కంటే తన హీరోయిన్లతోనే ఎక్కువ గడిపాడు. మొదట్లో నాకే విషయం తెలియదు. అన్ని తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది. అప్పటికే జీవితం ముందుకెళ్ళింది”. అని తెలిపింది.
ALSO READ:SSMB 29 : మహేష్ సినిమాలో సింహం… ఇంతలా దాచుంచడం వెనుక పెద్ద స్టోరీ ఉందే!
ఇక అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఆయన చాలామందితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆయనను నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేదు కాబట్టి నేను వాటిని నమ్మను. కాకపోతే మరాఠీ నటి తో ఆయన ఎక్కువగా ఉన్నట్లు విన్నాను” అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే తాను ఏదీ ధైర్యంగా చూడలేదు కాబట్టి ఇలాంటి వాటిని తాను నమ్మను అని చెప్పి విడాకుల రూమర్స్ కు క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
1980లో యాక్షన్ , డాన్సింగ్ హీరోగా తన కెరీర్ను ప్రారంభించిన గోవింద.. 1986లో వచ్చిన లవ్ 86 అనే సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించారు.. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. తన సినీ కెరియర్ లో ఏకంగా 12 ఫిలింఫేర్ అవార్డు నామినేషన్లు అందుకున్నారు. అలాగే రెండు ఫిలిం ఫేర్ ప్రత్యేక అవార్డులు , ఉత్తమ హాస్యనటుడిగా ఒక ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నారు.