BigTV English
Advertisement

Russia: ఇరాన్‌పై అమెరికా అటాక్.. రష్యా సంచలన వ్యాఖ్యలు, ట్రంప్‌కి త్వరలోనే గట్టిగా?

Russia: ఇరాన్‌పై అమెరికా అటాక్.. రష్యా సంచలన వ్యాఖ్యలు, ట్రంప్‌కి త్వరలోనే గట్టిగా?

Russia: ఇరాన్ దేశంపై అమెరికా గగనతలం అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు స్థావరాలపై దాడి చేసినట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణుస్థావరాలను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలను ఇచ్చేందుకు చాలా దేశాలు రెడీ ఉన్నాయని చెప్పారు. అయితే.. వాటి పేర్లను మాత్రం బయటకు చెప్పలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులను రష్యా మొదటినుంచి వ్యతిరేకించడం.. ఆ దేశ అణ్వాయుధాలను కూడా కలిగి ఉండడంతో మెద్వదేవ్ వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి.


అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీరుపై ఆయన ఫైరయ్యారు. మధ్యప్రాచ్యంలో మరో యుద్ధానికి ట్రంప్ కారకుడుయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేవారు. శాంతి దూతగా చెప్పుకుని అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ట్రంప్.. మరో యుద్ధానికి తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ అటాక్‌తో ఇరాన్ లోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని.. సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆ దేశంపై దాడులు చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు. అమెరికా కొత్త వివాదానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ తన తీరు మార్చుకుంటే.. ఆయనకే మంచిదని సూచించారు.

ALSO READ: Viral video: థాయిలాండ్‌కు వెళ్లిన భారత పర్యాటకులు ఇలా చేశారేంటి? వీడియో వైరల్..


ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మూడు అణుస్థావరే లక్ష్యంగా అటాక్ చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు త్వరలోనే సరైన గుణపాఠం నేర్పిస్తసామని అన్నారు. ఇస్తాంబుల్ లో జరుగుతోన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా అబ్బాస్ మీడియాతో మాట్లాడారు. తాజా యుద్ధ పరిస్థితుల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చిస్తామని అన్నారు. ఆయనతో భేటీ అయ్యేందకు మాస్కోకి వెళ్తున్నట్టు చెప్పారు. రేపు పుతిన్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

ALSO READ: Arrowhead Tiger: అడవినే దడపుట్టించిన ఆరోహెడ్ టైగర్ ఇక లేదు.. చివరి వీడియో వైరల్

రష్యా తమకు మిత్ర దేశమని అన్నారు. రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని వివరించారు. తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించేందుకే మాస్కోకి వెళ్తున్నట్టు చెప్పారు. ఆయనతో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇంటర్నేషనల్ యాక్ట్‌ను ఉల్లంఘించి అమెరికా అణుస్థావరాలపై అటాక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణు స్థావరాలపై అటాక్ చేసి.. అమెరికా తన హద్దును దాటేసిందని మండిపడ్డారు. అందుకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించకోవాల్సి వస్తుందని అన్నారు. యూఎన్ చార్టర్ లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ చేసుకునే హక్కును వినియోగించుకుంటామని చెప్పారు. సరైన టైం చూసి అమెరికాకు తగిన బుద్ధి గట్టిగా చెబుతామని అబ్బాస్ ఫైరయ్యారు.

Related News

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

Big Stories

×