Actor Death:ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది.. చివరి రోజుల్లో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ.. సకాలంలో చికిత్స అందక తుది శ్వాస విడిచిన వారు చాలామంది ఉన్నారు. నిజానికి చాలామంది సినిమాలలో నటిస్తున్నప్పుడు వచ్చిన డబ్బును వృధా చేసుకోకుండా రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ రంగాలలో పెట్టుబడిగా పెట్టి ఆర్థిక భరోసాను సొంతం చేసుకుంటుంటే.. మరికొంతమంది జల్సాలకు లేదా దానధర్మాలకు పోయి డబ్బు మొత్తాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తూ.. చివరి రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. ఇంకొకరి నుండీ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బు సరిపోక.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, చివరికి చికిత్సకు డబ్బు లేక మరణిస్తున్నారు. అలాంటివారి జాబితాలోకి ఇప్పుడు మరొక నటుడు కూడా వచ్చి చేరారు. గత కొంతకాలంగా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసిన ఆయన చివరికి నేడు తుది శ్వాస విడిచారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ్ యాక్టర్ అభినయ్ (Abhinay).44 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు చెన్నైలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలి చిత్రమైన ‘థూల్లువాదో ఇళమై’ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అభినయ్.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సుమారుగా 15 చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే చివరి రోజుల్లో చికిత్సకు అవసరమైన డబ్బు అందక ఆర్థిక సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇకపోతే ఓరియో బిస్కెట్స్ యాడ్ తో సహా పలు ప్రకటనల్లో కూడా అభినయ్ కనిపించారు.
ALSO READ:Film industry: హీరోయిన్లతో నటుడు రాసలీలలు… ఎవరితో నడిపించాడో తెలుసు అంటున్న భార్య
ఇకపోతే ఆయన తన మరణాన్ని ముందే ఊహించినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం చెన్నైలోనే ఆయన ఇంట్లో ఉంది. అంత్యక్రియలు నిర్వహించడానికి ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేనందున పరిస్థితిని అంచనా వేసి తన అంత్యక్రియలు నిర్వహించాలని నడిగర్ సంఘం అధ్యక్షులను , ప్రతినిధులను కోరినట్లు సమాచారం. గతంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు భయంకరమైన రోగ నిరూపణను అందించారని వెల్లడించిన అభినయ్.. నేను ఎక్కువ కాలం ఉంటానో లేదో నాకు తెలియదు అంటూ తెలిపారు.
ఇకపోతే అభినయ్ కి వచ్చిన ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని వైద్యులు ఏడాదిన్నర మాత్రమే జీవిస్తాడని చెప్పారట. ఈ విషయాన్ని అభినయ్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆయన అంతక్రియలను నడిగర్ సంఘం ప్రతినిధులు నిర్వహించబోతున్నట్లు సమాచారం.