UP Lovers Incident: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. లవర్‌ను కాల్చి చంపిన ప్రియుడు.. ఆ తర్వాత తను కూడా కాల్చుకున్నాడు.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్ యూనివర్సిటీలో జరిగింది. మనీష్ సాహు, కృతిక ఇద్దరూ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.. వీరిద్దరు లలిత్ పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
అయితే వీరిద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుందేల్ ఖండ్ యూనివర్సిటీలో ఎమ్‌బీఎ చదువుతున్నట్లు తెలిపారు. అయితే వీరిద్దరు నిన్న ఆదివారం క్యాంపస్ నుంచి బయటకు వెళ్లి కాసేపు టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత కృతికాను హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడు.. ఇంతలో తన దగ్గర ఉన్నటువంటి గన్ తీసి కృతికను కాల్చి.. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని చనిపోయాడు.. అయితే పేలుడు శబ్దాలు విని యునివర్సిటి వారంత బయటికి వచ్చి చూసే వరకు ఇద్దరు మృత దేహాలు కనిపించాయి.. దీంతో అక్కడి వారంత ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
Also Read: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
దీంతో వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి అసల మనీష్ కృతికాను ఎందుకు చంపాడు అని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో మనీష్ అక్కడికక్కడే చనిపోయాడు.. కానీ, కృతికా పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కృతికా సృహాలోకి వస్తే కాని అసలు మనీష్ ఎందుకు అలా చేశాడని కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైన ఎంతో సంతోషంగా ఉన్న విరిద్ధరి మధ్య ఏమైంది.. అసలు బయటకు వెళ్ళి వచ్చాక మనీష్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు.. అంటే బయటకి వెళ్లినప్పుడు ఏమైన గోడవ పడ్డారా లేదా వేరే ఏమైన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.