Pranitha Subhash Latest Photos: అమ్మో బాపుగారి బొమ్మో అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటలు పాడించుకున్న ముద్దుగుమ్మ ప్రణీత.
కలువళ్లాంటి కళ్లు.. పాలమీగడ లాంటి అందంతో పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంది ప్రణీత..
శాండిల్‌వుడ్ నుండి.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు విజయాలు అందుకుంది. పవన్ కళ్యణ్, ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండలులు తుమ్మెద, రభస, హలో గురూ వంటి పలు చిత్రాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
ప్రణీత మంచి మనసు చూస్తే.. ఎవర్రైనా ఫిదా అవ్వాల్సింది. కోవిడ్ టైమ్‌లో ఎందరో పేదలు, అనాదలకు ఆమె సాయం చేసింది. ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనం సమకూర్చింది. ఇటు అడిగిన వారికి డబ్బులు కూడా సమకూర్చింది. బెంగుళూరులో అన్నపూర్ణగా అవతరించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రణీత బెంగుళూరుకి చెందిన బిజెనెస్‌మాన్ నితిన్ రాజ్‌ను వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ప్రణీత ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.
పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంకెందుకు ఆలస్యం. మీరు ఓ లుక్కేయండి.