OTT Movie : కొరియన్ మూవీ ఫ్యాన్స్ ని థియేటర్లకి రప్పించి కంటతడి పెట్టించిన సినిమా ‘One Day’. ఈ సినిమా ఒక అద్భుతం అని ప్రశంసలు కూడా వచ్చాయి. ఇందులో రొమాన్స్ లేదు, యాక్షన్ సీన్స్ అంతకన్నా లేవు. ఒక సింపుల్ స్టోరీని అందంగా ప్రజెంట్ చేశారు. కోమాలో ఉన్న ఒక మహిళ స్పిరిట్‌ని చూసిన ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, ఆమె ఆఖరి కోరికను నెరవెర్చే క్రమంలో ఈ కథ తిరుగుతుంది. ఫ్యామిలీతో లేదా ఒంటరిగా చూడటానికి ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే టిష్యూని పక్కనే పెట్టుకుని చుడండి. ఏ సమయంలో నైనా అవసరం పడచ్చు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? ఈ స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసు కుందాం పదండి.
‘One Day’ 2017లో వచ్చిన సౌత్ కొరియన్ ఫాంటసీ మూవీ. లీ యూన్-కి దర్శకత్వంలో కిమ్ నామ్-గిల్, చున్ ఉ-హీ ఇందులో మెయిన్ లీడ్స్ లో నటించారు.118 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 6.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2017 April 5న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
గాంగ్-సూ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ భార్య మరణంతో డిప్రెషన్‌లో మునిగిపోయి, జాబ్‌ను రొటీన్‌గా సాగిస్తుంటాడు. ఒక రోజు కోమాలో ఉన్న మి-సో కేస్ తీసుకుంటాడు. అయితే విచిత్రంగా ఆమె స్పిరిట్ అతడికి మాత్రమే కనిపించి, తన ఆఖరి విష్ (కోమాలో ఉన్న ఆమెకు ప్రపంచం చూపించాలి) నెరవేర్చమని అడుగుతుంది. మొదట గాంగ్-సూ భయపడి దూరంగా ఉంటాడు కానీ, మి-సో ఇన్నోసెంట్ స్వభావం, ఆమె గ్రీఫ్ చూసి సహాయం చేయడం మొదలుపెడతాడు. హాస్పిటల్ లోనే మాట్లాడుకుంటూ, ఆమెకు బయటి ప్రపంచం డిస్క్రైబ్ చేస్తాడు. ఇద్దరూ ఒకరి గ్రీఫ్ మరొకరితో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ బాండ్ ఏర్పరుచుకుంటారు.
Read Also : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు
తర్వాత గాంగ్-సూ, మి-సోను హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్లి, సముద్రం, పార్క్, సిటీ వీధులు చూపిస్తాడు. ఆమె స్పిరిట్‌గా ఉండి కూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌లు ఫీల్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో గాంగ్-సూ తన భార్య మరణం గురించి ఓపెన్ అవుతాడు. మి-సో తన లైఫ్ రిగ్రెట్స్ షేర్ చేస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు హీల్ చేస్తారు. చివరికి మి-సో విష్ నెరవేరి, ఆమె స్పిరిట్ గుడ్‌బై చెప్పి డిసప్పియర్ అవుతుంది. గాంగ్-సూ లైఫ్‌లో ముందుకు సాగడం నేర్చుకుంటాడు. ఈ మూవీ ఒక హోప్ ఫుల్ నోట్ తో ఎండ్ అవుతుంది.