Rukmini vasanth: రుక్మిణి వసంత్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు .అయితే తాజాగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)తన ఎక్స్ ఖాతా ద్వారా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ఎంతోమంది ఇతరుల పేరును ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ పేరు మీద కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ విషయంపై రుక్మిణి వసంత స్పందిస్తూ.. 9445893273 ఈ నెంబర్ ఉపయోగిస్తూ ఒక వ్యక్తి అచ్చం నాలాగే మాట్లాడుతూ.. ఇతరులను సంప్రదించినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ నెంబర్ నాది కాదని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ లు వస్తే అవి పూర్తిగా ఫేక్ అని మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఇలాంటి మెసేజ్, ఫోన్ కాల్ కు స్పందించవద్దని తెలియజేశారు. ఇలా ఒకరి పేరును ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడటం సైబర్ నేరం అవుతుంది. ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారి పట్ల తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు.
ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పష్టత కోసం మీరు నేరుగా నన్ను లేదా నా టీంను సంప్రదించవచ్చని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు ఈ సైబర్ ఉచ్చులో పడకుండా రుక్మిణి వసంత్ తన అభిమానులను అలర్ట్ చేశారు.
🚨 Important Alert & Awareness Message 🚨
It has come to my attention that an individual using the number 9445893273 is impersonating me and reaching out to various people under false pretenses.
I want to clarify that this number does not belong to me, and any messages or calls…
— rukmini (@rukminitweets) November 7, 2025
ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈమె కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న డ్రాగన్(Dragon) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమా చేయబోతున్నారని అందులో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలతో కెరియర్ పరంగా రుక్మిణి ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Rashmika Mandanna: విజయ్ తో ఆ సినిమా చాలా ప్రత్యేకం.. అసలు విషయం చెప్పిన రష్మిక!