Dulquer Salmaan: మామూలుగా ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారంటే చాలు.. ఆ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ విపరీతంగా పెరిగిపోతోంది. ఆ హీరోలు ఎవరైనా సరే.. కచ్చితంగా మల్టీ స్టారర్ అంటే మినిమమ్ హైప్ ఉంటుంది. మల్టీ స్టారర్ మాత్రమే కాదు.. ఒక సీనియర్ హీరో సినిమాలో ఒక యంగ్ హీరో ఉన్నా కూడా అదే రేంజ్‌లో హైప్ వస్తుంది. గత కొన్నేళ్లుగా ఇదే మేకర్స్‌కు సక్సెస్ ఫార్ములాలాగా కూడా మారిపోయింది. ఇప్పుడు తాజాగా మరొక ఊహించని కాంబినేషన్ సెట్ అయ్యేంత వరకు వెళ్లింది. కానీ చివరి నిమిషంలో సెట్ అవ్వలేదు. ఆ విషయాన్ని దర్శకుడే స్వయంగా బయటపెట్టాడు. దీంతో ఈ కాంబో సెట్ అయితే బాగుండేదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
డల్లాస్‌లో ఈవెంట్
బాబీ (Bobby) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) నటించిన సినిమానే ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). మామూలుగా బాలయ్య సినిమాలు అనగానే మినిమమ్ హైప్ ఉంటుంది. అలాగే ‘డాకు మహారాజ్’ కూడా ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీని గ్లోబల్ స్థాయి వరకు తీసుకెళ్లడం కోసం ‘గేమ్ ఛేంజర్’ రూటు ఫాలో అయ్యారు మేకర్స్. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డల్లాస్ బయల్దేరారు మేకర్స్. ఇక లేట్ అయినా కూడా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా అక్కడే చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో ప్రేక్షకులతో ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు దర్శకుడు బాబీ.
Also Read: ఉగ్రరూపంలో షాహిద్ కపూర్.. ‘దేవ’ టీజర్‌తో షాకిచ్చిన బాలీవుడ్ హీరో
ఆలోచనకే షాక్
‘డాకు మహారాజ్’లో హీరో బాలకృష్ణే అయినా దీని కథను రాసుకునేటప్పుడు హీరోకు సమానంగా ఒక కీలక పాత్రను రాసుకున్నాడట బాబీ. ఇక ఆ పాత్రలో నటించడానికి దుల్కర్ సల్మాన్ అయితే బాగుంటాడని ఫీలయ్యాడట. అలా ఫిక్స్ అయిన కొన్నిరోజుల తర్వాత కథలో ఆ పాత్ర అనవసరమని అనిపించిందని బాబీ చెప్పుకొచ్చాడు. అందుకే ‘డాకు మహారాజ్’లో ఆ పాత్ర లేదు, దుల్కర్ సల్మాన్ కూడా లేడని రివీల్ చేశాడు. అయితే అసలు బాలకృష్ణ సినిమాలో దుల్కర్ సల్మాన్ లాంటి సాఫ్ట్ హీరోను తీసుకోవాలనే ఆలోచన బాబీకి ఎలా వచ్చిందా అని ప్రేక్షకులు షాకవుతున్నారు. అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నారు.
కొత్త అనుభూతి
‘డాకు మహారాజ్’తో కొత్త ప్రపంచాన్ని చూస్తారని బాలకృష్ణ ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు దర్శకుడు బాబీ. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నాడు. తను చెప్పినట్టుగానే ‘డాకు మహారాజ్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటివరకు విడుదలయిన పాటలు కూడా పరవాలేదనిపించాయి. కానీ ఇటీవల విడుదలయిన ఐటెమ్ సాంగ్ ‘దబిడి దిబిడి’కి అయితే చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘డాకు మహారాజ్’లో బాలయ్యకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ, ప్రగ్య జైస్వాల్ నటించారు. జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది.