Rashmika -Vijay’s wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే మరొక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈమె నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో రిలేషన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై రష్మిక ఎక్కడ స్పందించలేదు. అయితే ఇటీవల వీరిద్దరూ చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ టీం క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటివరకు రష్మిక విజయ్ దేవరకొండ ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.
ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి ఉదయపూర్ ప్యాలెస్ లో జరగబోతుందని డెస్టినేషన్ వెడ్డింగ్(Destination wedding) ప్లాన్ చేస్తున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో రష్మిక పెళ్లి పనులను మొదలు పెట్టిందని తెలుస్తుంది. ఈ పెళ్లి పనులలో భాగంగా ఈమె మూడు రోజులపాటు రాజస్థాన్లోని జైపూర్ (Jaipur)లో పర్యటించారని సమాచారం.
రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగినప్పటికీ పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే రష్మిక మూడు రోజులపాటు రాజస్థాన్ లోని జైపూర్ లో పర్యటించి కొన్ని రిసార్ట్ లను పరిశీలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి వివాహం జైపూర్ లోనే జరగబోతోంది అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే వీరి వివాహపు వేదిక అలాగే పెళ్లి తేదీ గురించి అధికారకంగా వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.
నెల వ్యవధిలోనే రెండు హిట్ సినిమాలు..
ఇక రష్మిక ప్రస్తుతం ఒకవైపు సినిమా పనులలో బిజీగా గడుపుతూనే మరోవైపు పెళ్లి పనులను కూడా చూసుకుంటున్నారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే రష్మిక తాజాగా థామా సినిమాతో పాటు నేడు విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా నెల వ్యవధిలోనే రెండు సినిమాలతో హిట్ కొట్టిన రష్మిక ప్రస్తుతం మరో నాలుగు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ సైతం కింగ్డమ్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఈయన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Rukmini Vasanth: రుక్మిణి పేరుతో మోసం… అలర్ట్ చేసిన నటి.. చర్యలు తప్పవంటూ!