BBL New Rule : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇటు ఆటగాళ్లకు, అటు అభిమానులకు మంచి ఉత్సాహకతను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్రతీ సంవత్సరం జరిగే బిగ్ బాష్ లీగ్, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో ఈ సారి క్రికెట్ అభిమానులకు గొప్ప కానుకను అందించబోతున్నాయి. ఈ టోర్నీ టీ-20 టోర్నీలలో రాబోతున్న సరికొత్త నిబంధన ప్రకారం.. స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకులు తమ అభిమాన జట్టు బ్యాటర్ సిక్సర్ లేదా ఫోర్ కొట్టిన బంతి తమతో పాటు ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. స్టేడియంలో ఆటను వీక్సిస్తున్న ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ సరికొత్త మార్పును తీసుకొచ్చింది. ఇది కేవలంలో ఆటలో రూల్ మాత్రమే కాదు.. అభిమానులకు చిరస్మరణీయమైన జ్ఞాపకాన్ని కూడా అందించే ప్రయత్నం అని చెప్పవచ్చు.
Also Read : Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్
అయితే ఈ రూల్ ఎలా వర్తిస్తుంది..? ఈ ఆఫర్ అన్ని ఓవర్లకు మాత్రం వర్తించదు. కేవలం తొలి ఓవర్ కి మాత్రమే వర్తించడం విశేషం. ఫస్ట్ ఓవర్ లో బ్యాటర్ బంతిని సిక్స్ గా లేదా ఫోర్ గా కొట్టి అది ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లితే.. ఆ బంతిని అదృష్టవంతులైన ప్రేక్షకులు కీప్ ది బాల్ విధానంలో తమ సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మొదటి ఓవర్‌లో ఒక బ్యాటర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు బంతిని బౌండరీకి పంపినా, ప్రతిసారీ కొత్త బంతిని వాడతారు. ఈ రూల్ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మొదటి ఓవర్‌లో, ఎక్కువ ఉత్సాహాన్ని నింపనుంది. ఆలస్యాన్ని నివారించడానికి ఏర్పాట్లు ఒకవేళ బంతి ప్రేక్షకుల వద్దకు వెళ్లి వారు తీసుకోకపోయినా లేదా మొదటి ఓవర్ పూర్తి కాగానే, ఆట ఆలస్యం కాకుండా ఉండేందుకు తక్షణమే కొత్త బంతిని ఆటలోకి తీసుకొస్తారు. దీనికి సంబంధించి అంపైర్లు తమ వద్ద ఎల్లప్పుడూ అదనపు మ్యాచ్ బంతులను సిద్ధంగా ఉంచుకుంటారు.
సాధారణంగా రెండో ఓవర్ నుంచి మిగతా ఇన్నింగ్స్ మొత్తం ఒకే బంతిని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ‘బాల్-కీపింగ్’ ఉత్సాహం వల్ల ఆటలో ఏమాత్రం ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆట పై ఫ్యాన్స్‌పై ప్రభావం ఈ కొత్త విధానం BBL, WBBL టోర్నీలకు కొత్త ఆకర్షణను తీసుకురానుంది. సిక్స్‌లు, ఫోర్‌ల ద్వారా ఆటగాళ్ళు కేవలం స్కోర్‌నే కాదు, అభిమానులకు అపురూపమైన బహుమతులను కూడా అందించనున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు తమ అభిమాన క్రికెటర్ కొట్టిన బంతిని దక్కించుకోవడం అనేది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. క్రికెట్‌ను మరింత ఫ్యాన్-కేంద్రీకృతం చేసే ఈ రూల్, టోర్నమెంట్ల ప్రజాదరణను మరింత పెంచడంలో సహాయపడుతుంది. అయితే BBL, WBBLలో తీసుకొచ్చిన ఈ సరికొత్త రూల్ ను బీసీసీఐ ఐపీఎల్ లో కూడా తీసుకొస్తే బాగుండు అని క్రికెట్ అభిమానులు పేర్కొనడం విశేషం.
Also Read : IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వర్షం..టీమిండియా గ్రాండ్ విక్టరీ