Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ గత సీజన్లలో ఎవ్వరూ క్రియేట్ చేయలేని రికార్డును ఇమ్మాన్యుయేల్ ఈ సీజన్లో తన పేరున రాసుకున్నాడు. నేటి ఎపిసోడ్ ఇమ్మూ అభిమానులకు పండగ అయితే, తనూజా ఫ్యాన్స్ కు మాత్రం మరిచిపోలేని బాధాకరమైన రోజు. కానీ ఇమ్మాన్యుయేల్ గేమ్ లో ఒకే ఒక్క మైనస్ ఉంది. అది ఆయన్ని బిగ్ బాస్ కప్పుకు దూరం చేస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అభిమానుల్లో. ఇంతకీ ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో 15 మంది కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్ కావడం అన్నది కష్టమైన పని. దానికి విల్ పవర్ తో పాటు హౌస్ మేట్స్ సపోర్ట్ ఉండాలి. ఈ రెండింటికి లక్కు కూడా తోడవ్వాలి. అది ఇమ్మాన్యుయేల్ కు పుష్కలంగా ఉన్నట్టు ఉంది. అందుకే ఏకంగా 3 సార్లు కెప్టెన్ అయ్యి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కానీ ఇమ్మూ ఫ్యాన్స్ కు ఇది మాత్రమే గుడ్ న్యూస్ కాదు. 3 సార్లు కెప్టెన్ అవ్వడంతో పాటు గత 9 వారాలుగా నామినేషన్లలోకి రాని ఘనత కూడా అతనిదే. ఒక కంటెస్టెంట్ ఒక వారం కాకపోతే మరో వారం నామినేషన్ లోకి వస్తారు. కానీ ఇమ్మూ మాత్రం కత్తి మీద సాము లాంటి ఇలాంటి రికార్డును అవలీలగా క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ చరిత్రలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ రికార్డు. ఇక ఇప్పటి కెప్టెన్సీలో 10వ వారం కూడా అతడు సేఫ్. ఈ గుడ్ న్యూస్ తో ఇమ్మూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ తనూజా అంత ప్రయత్నించినా ఈసారి కూడా కెప్టెన్సీ చేజారడంతో గుక్కపెట్టి ఏడ్చింది. చివరి వరకూ ఈ వారమైనా ఆమె కెప్టెన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్న తనూజా ఫ్యాన్స్ కు గట్టి షాక్ తగిలింది.
ఇక ఈ రికార్డుల సంగతిని పక్కన పెట్టేస్తే… కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా ఉంది ఇమ్మూ ఆట. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు. 9 వారాల్లో ఒక్కసారి కూడా అతను నామినేట్ కాకపోవడం అన్నది ఇక్కడ అతనికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో 3 వారాలు ఇలాగే సేఫ్ అయితే టాప్ 5లోకి వెళ్లొచ్చు. కానీ విన్ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువే. ఎందుకంటే అప్పుడప్పుడైనా నామినేషనల్లో ఉంటే అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ పెరగడంతో పాటు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలిసేది. కానీ నామినేషన్ లలో ఉంటే ఎలిమినేట్ అవుతానేమో అని భయపడడం, ఇప్పుడున్న పరిస్థితినీ చూస్తుంటే ఇమ్మూ చేజేతులా బిగ్ బాస్ ట్రోఫీని చేజేతులా వదిలేసుకుంటున్నట్టు కన్పిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Read Also : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం