Mirnalini Ravi Buy Brand New Mahindra BE6: మృణాళిని రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీతో ఈ భామ లైమ్ లైట్లోకి వచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ అందం, అభినయం ఆడియన్స్ ఫిదా అయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం కాదు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గద్దలకొండ గణేష్ సినిమాతో తర్వాత ఈ భామ ఎన్నో సినిమాలు చేసింది. కానీ, ఆ రేంజ్లో గుర్తింపు రాలేదు. ఎనిమీ (2021),కోబ్రా (2022), మామా మశ్చీంద్ర వంటి చిత్రాలు చేసింది.
మరోవైపు తమిళంలో చాంపియన్ (2019, తమిళం), జాంగో (2021) సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఆమె నటించి సూపర్ డీలక్స్ సినిమాలో ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డుకు ఎన్నికైంది. తాజాగా ఈ భామ తన గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. తాను లేటెస్ట్ బ్రాండ్ న్యూ కారుని సొంతం చేసుకున్నట్టు చెప్పంది. డైలివరికి వచ్చిన కారు టెస్ట్ డ్రైవ్ చేస్తున్న వీడియో, ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సరికొత్త హంగులతో లేటెస్ట్ డిజైన్ చేసిన మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కారు సొంతం చేసుకుంది. మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను ఇటీవల ఆగష్టులో లాంచ్‌లో చేసిన సంగతి తెలిసిందే.
ఫ్రీడమ్ NU పేరుతో ఈవెంట్ నిర్వహించి దీన్ని విడుదల చేశారు. కొత్త కారు నేరుగా డెలివరైన సందర్భంగా మురిసిపోతు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కారు, ఫోటోలు షేర్ చేసింది. మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ నటి మృణాళినే కావడం విశేషం. దీంతో ఈ కారు ఫీచర్స్, ధరపై అంత ఆసక్తి చూపిస్తున్నారు. దీని ధర రూ. 27.79 లక్షలు అని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ లేటెస్ట్ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ BE6ని పలువురు స్టార్ క్రికెటర్లు కోనుగోలు చేశారు. అలాగే బాలీవుడ్‌లో స్టార్ హీరోలు కూడా ఈ మహీంద్రా లేటెస్ట్ ఎడిషన్ తమ గ్యాలరీ చేర్చారు. అయితే దక్షిణాది నటీనటుల్లో ఈ కారు సొంతం చేసుకున్న తొలి సినీ నటి ఈమె. దీంతో మృణాళిని రవికి అభిమానులు, ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఈ కారులో ముందు అమర్చిన స్క్రీన్ 12.3-అంగుళాల డిస్ప్లేలతో తయారు చేశారు. ఇది ఫుల్ టచ్‌స్క్రీన్. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో ఫిక్స్‌డ్ పనోరమిక్ రూఫ్, డాల్బీ అటామోస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో, లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌తో తయారు చేశారు. బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ సాధారణ BE6 మాదిరిగానే పవర్‌ట్రెయిన్ అండ్ అండర్‌పిన్నింగ్‌లను కలిగి ఉంది. ఇది మహీంద్రా స్వయంగా అభివృద్ధి చేసిన INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ హై-వోల్టేజ్ మాడ్యులర్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ XEV 9e త్వరలో లాంచ్ చేయబోయే XEV 9AS లలో కూడా కనిపిస్తుంది. BE6 రెండు బ్యాటరీ ప్యాక్‌లకు కలిగి ఉంది. అందులో ఒకటి 59kWh అండ్ 79 kWh. ఎలక్ట్రిక్ మోటారు వెనుక ఇరుసుపై అమర్చబడి 281 bhp మరియు 380 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం కేవలం 6.7 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకోగలదు. మహీంద్రా దీనికి నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను ఇచ్చింది – డిఫాల్ట్, రేంజ్, ఎవ్రీడే మరియు రేస్. అయితే, బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ పరిమిత ఎడిషన్ రేంజ్-టాపింగ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. BYD-ఆధారిత ఈ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 682 కి.మీ. కెపాసిటీ కలిగి ఉంది.