OTT Movie : మలేషియన్ జానపద కథలు, ఇస్లామిక్ నమ్మకాల ఆధారంగా రూపొందించబడిన హారర్ సినిమా ‘బ్లడ్ ఫ్లవర్’. ఇందులో 16 ఏళ్ల కుర్రాడు ఒక భయంకరమైన డెమన్ ను ఎదుర్కొంటాడు. చేతబడి, డెమన్ అటాక్ లతో ఈ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మలేషియన్ హారర్ ఫ్యాన్స్ కి ఇదొక మస్ట్ వాచ్ మూవీ. సింగిల్ గా చూసే ధైర్యం మాత్రం చేయకండి. ఎందుకంటే కంటెంట్ అంత భయంకరంగా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బ్లడ్ ఫ్లవర్’ (Blood Flower) అనేది 2023లో విడుదలైన ఒక మలేషియన్ హారర్ చిత్రం. దీని అసలు పేరు ‘Harum Malam’. దీనికి డైన్ సైడ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇడాన్ ఐడాన్, బ్రోంట్ పాలరే, రెమీ ఇషాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అవ్వగా, ప్రస్తుతం షడ్డర్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఈ సినిమా ఇక్బాల్ అనే 16 ఏళ్ల టీనేజ్ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. అతనికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. మరణించిన వారి ఆత్మలు చూసే శక్తి అతనికి ఉంటుంది. అతని తల్లి, తండ్రి కూడా షమన్ లుగా ఉంటారు. అనుకోకుండా ఒక రోజు బంధించి ఉన్న ఒక దుష్ట ఆత్మను తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఇక్బాల్ విడుదల చేస్తాడు. ఆ ఆత్మ అతన్ని, అతని చుట్టూ ఉన్నవారిని వేధించడం మొదలుపెడుతుంది. తన కుటుంబ సభ్యులను, స్నేహితులను రక్షించడానికి ఇక్బాల్ తన శక్తులను ఉపయోగించవలసి వస్తుంది. కానీ దెయ్యం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Read Also : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఇక్బాల్ తన అంకుల్ సహాయంతో డెమన్ గురించి తెలుసుకుంటాడు. అది రక్తపువ్వుతో బంధించబడిన ఈవిల్ స్పిరిట్. ఒకసారి రిలీజ్ అయితే ఫీడ్ చేసుకుంటూ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్బాల్ తన షమానిక్ పవర్స్ ఉపయోగించి ఎక్సార్సిజం రిచ్యువల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ డెమన్ ఫ్యామిలీని ఒక్కొక్కరుగా అటాక్ చేసి పాజెస్ చేస్తుంది. అక్కడ బ్లడ్ వామిటింగ్, సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతాయి. ఫైనల్‌లో ఇక్బాల్ డెమన్ ఒరిజిన్ తెలుసుకుని, బ్లడ్ ఫ్లవర్‌ని డిస్ట్రాయ్ చేయడానికి రిచ్యువల్ చేస్తాడు. ఈ రిచ్యువల్ చాలా భయంకరంగా సాగుతుంది. చివరికి ఆ డెమన్ ని ఇక్బాల్ బంధిస్తాడా ? దాని చేతిలో బలవుతాడా ? అనేది ఈ మలేషియన్ హారర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.