Priyanka Mohan Latest Photos: ‘సరిపోదా శనివారం’ సినిమాలో చారులత పాత్రలో తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది ప్రియాంక మోహన్.
ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ప్రియాంక మోహన్ గ్లామర్ షోకు దూరంగానే ఉంటుంది.
అంతే కాకుండా ఎక్కువగా సింపుల్‌గా ఉండడానికే ప్రియాంక మోహన్ ఇష్టపడుతుందని తన సోషల్ మీడియా పోస్టులు చూస్తే క్లారిటీ వస్తుంది
తాజాగా పింక్ కలర్ ప్రింటెడ్ లాంగ్ ఫ్రాక్‌లో ఫోటోలు షేర్ చేసింది ప్రియాంక.. అందులో తను సింపుల్‌గా ఉన్నా చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రియాంక మోహన్ చేతిలో ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. అదే ‘ఓజీ’.
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ మూవీలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది ప్రియాంక మోహన్.
ఇక తమిళంలో కూడా పలు భారీ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయడానికి ప్రియాంక మోహన్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.