Baahubali The Epic : రీసెంట్ టైమ్స్ లో పాత సినిమాలు రీ రిలీజ్ చేయడం అనేది ట్రెండ్ గా మారింది. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాతో తారాస్థాయికి చేరిపోయింది. ఆ తర్వాత చాలామంది హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ట్రెండ్ నడుస్తున్న టైం లో వేరే హీరోలు సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. వర్షం, సింహాద్రి వంటి సినిమాలకు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది అని అందరు ఊహించారు. కానీ ఆ సినిమాలకు ఊహించిన ఆదరణ రాలేదు.
రీ రిలీజ్ సినిమాలకు వెళ్లి సినిమాలలో వచ్చే పాటలను పాడుతూ వీడియోలు తీయడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. చాలామంది ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇకపోతే చాలామంది బాహుబలి సినిమా రి రిలీజ్ అయితే ఉంటుంది అని అప్పట్లో మాట్లాడుకునేవాళ్ళు. అయితే రెండు సినిమాలను కలిసి ఒకే పార్ట్ గా ఎస్.ఎస్ రాజమౌళి ప్లాన్ చేస్తూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు విషెస్ స్పందన లభిస్తుంది.
బాహుబలి సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమా గురించి చాలావరకు ట్రోలింగ్ నడిచింది. సినిమా డిజాస్టర్ టాక్ కూడా వచ్చింది. చిత్ర యూనిట్ అంతా టెన్షన్ పడిపోయింది. అయితే అప్పట్లో బాహుబలి సినిమా చూసి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని కొంతమంది ఈ సినిమాకు సంబంధించి రివ్యూ అడిగారు.
చిరంజీవి మాట్లాడుతూ సినిమా బాగుంది అండి అందరికీ నచ్చుతుందా లేదా అనేది చూడాలి అంటూ చాలా ప్రొఫెషనల్ గా చెప్పారు. వెంటనే ఒక వ్యక్తి బాహుబలి సినిమా కంటే మగధీర సినిమా బాగుంది సార్ అంటారు. అలా అనకూడదండి, అది చెప్పడానికి ఇంకా టైం ఉంది అన్నట్లు ఒక ఆన్సర్ చెప్పారు చిరంజీవి.
అయితే అప్పుడు సినిమా టాక్ చాలా చోట్ల నెగిటివ్ గా వినిపించింది. బహుశా అదే ప్రభావంతో మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో చెప్పి ఉండవచ్చు. అయితే మెగాస్టార్ అసహనంగా బాహుబలి సినిమా రివ్యూ ఆ రోజుల్లో చెప్పారు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం మెగాస్టార్ పాత వీడియో వైరల్ గా మారింది.
బాహుబలి సినిమా విడుదలై అప్పట్లో అన్ని సినిమా రికార్డులను కూడా చెరిపేసింది. ఇప్పుడు రీ రిలీజ్ సినిమాల అన్ని రికార్డ్స్ కూడా బాహుబలి సినిమా కొల్లగొడుతుంది అని చాలామందికి విపరీతమైన నమ్మకం ఉంది. ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో వస్తాయో అని చాలామందికి ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
Also Read: Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే