Bison: U-18 రీసెంట్ టైమ్స్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఆదరణ సాధించుకున్న చిత్రాలలో బైసన్ ఒకటి. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా, మరోవైపు అద్భుతమైన ప్రశంసలు కూడా అందుకుంటుంది. అతి తక్కువ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ సినిమాకి జరగటం ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమాకి విప్పరీతమైన ప్రశంసలు వచ్చాయి.
ప్రశంసలతో పాటు అక్కడక్కడ ఎప్పుడూ అవే కాన్సెప్ట్ సినిమాలు తీస్తూ ఉంటారు అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దానికి పలు సందర్భాలలో దర్శకుడు మారి సమాధానం కూడా చెప్పారు. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్స్ నుంచి కూడా బైసన్ సినిమాకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కించిన సినిమా కాబట్టి ఎక్కువ చర్చనీయాంసం అవుతుంది.
ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత U-18 మహిళల కబడ్డీ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఆడిన కార్తీక, భారతదేశం మరియు తమిళనాడుకు కీర్తిని తెచ్చిపెట్టింది. మరియు ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై విజయంలో కీలక పాత్ర పోషించింది.
విజయంలో కీలక పాత్ర పోషించిన కుమార్తె కార్తీకకు నా అభినందనలు మరియు ఆనందాన్ని తెలియజేయడానికి మరియు ఈ విజయంలో బలమైన శక్తిగా నిలిచిన ఆమె కన్నగి నగర్ కబడ్డీ జట్టు ప్రయత్నాలను అభినందించడానికి నేను ఈరోజు కార్తీక ఇంటికి వెళ్లాను.
అంతేకాకుండా వారిని ప్రోత్సహించడానికి, దర్శకుడు పా రంజిత్ నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు బైసన్ చిత్ర బృందం తరపున కార్తీకకు ₹ 5 లక్షల చెక్కును మరియు ఆమె కన్నగి నగర్ కబడ్డీ జట్టుకు ₹ 5 లక్షలను అందజేయడానికి నేను సంతోషిస్తున్నాను. కన్నగి నగర్ కార్తీకాలు తిరుగులేని మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అంటూ మారి సెలవరాజ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
சமீபத்தில் பஹ்ரைனில் நடந்த ஆசிய இளைஞர் விளையாட்டுப் போட்டியில் தங்கம் வென்ற இந்திய U-18 பெண்கள் கபடி அணியின் துணைத் தலைவராக விளையாடிய கார்த்திகா இந்தியாவிற்கும் தமிழ்நாட்டிற்கும் பெருமை தேடித்தந்து இறுதிப் போட்டியில் ஈரான் அணிக்கு எதிரான ஆட்டத்தில் பெற்ற வெற்றியில் அவர் முக்கிய… pic.twitter.com/nzTwkf1Aia
— Mari Selvaraj (@mari_selvaraj) October 30, 2025
మారి సెల్వరాజ్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే మారి కేవలం రీల్ లైఫ్ లో తన సినిమాలలో ఇలాంటివి చూపించడం మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో తన వంతు ప్లేయర్స్ కోసం నిలబడటం. వాళ్లకు ఆర్థిక సహాయం అందించటం కూడా మారి మంచితనానికి వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాలి.
Also Read: Bahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్