E-Paper
Advertisement

Hari Hara VeeraMallu : పవన్ కరుణించాడు… మొత్తానికి నిధి కల నెరవేరింది..

Hari Hara VeeraMallu : పవన్ కరుణించాడు… మొత్తానికి నిధి కల నెరవేరింది..
Advertisement

Hari Hara VeeraMallu : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది వరకు వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. అయితే అతి తక్కువ రోజులను కేటాయిస్తూ సినిమాలను పూర్తి చేసే పని మొదలు పెట్టాడు. ఇక ఏపీలో ఎన్నికలకు సమయం లేకపోవడంతో కొన్ని సినిమాలను పూర్తి చెయ్యలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఏం అవ్వడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. అయితే హరిహర వీరమల్లు పవన్ డ్రీమ్ ప్రాజెక్టు.. దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరైందని సమాచారం.

నిధి అగర్వాల్ హరిహరవీరమల్లు షూటింగ్ కోసం విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడుకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఈ సినిమా తప్ప మరే సినిమా ఈమె చేతిలో లేదని తెలుస్తుంది. ఈ అమ్మడు చివరగా.. హీరో అని ఓ మూవీ చేసింది. అది కూడా డిజాస్టర్.. ఇప్పుడు ఈమెకు ఉన్న ఆశ హరి హర వీరమల్లు, ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలు మాత్రమే మాత్రమే.. ఇక ప్రభాస్ మూవీ రాకముందు నుంచే పవన్ హరి హర వీరమల్లుపై చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక సినిమా పని అయిపోయింది అందరూ అంటే, ఎక్కువ టెన్షన్ పడ్డది ఈమెనే..

Advertisement

గత కొన్ని రోజులుగా ఖాళీ ఉన్న ఈ అమ్మడుకు ఈ ఒక్క మూవీ హిట్ అయితే, పాన్ ఇండియా వైడ్ ఫేమ్ వస్తుందని అనుకుంది. మరి ఆ కోరిక నెరవేరడం పవన్ చేతిలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు రాజా సాబ్ ఉంది కానీ, రాజా సాబ్ లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు.. ఆ ముగ్గురు హీరోయిన్స్ ను దాటి, ప్రభాస్ ను దాటి పేరు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.పవన్ కళ్యాణ్ మూవీ పీరియాడిక్ కాబట్టి దీనికోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఫైనల్ గా సెట్స్ లోకి అడుగు పెట్టింది.. కొద్ది రోజులు ఇక్కడే షూటింగ్ అయ్యాక మళ్లీ వేరే ప్రాంతంలో చివరి షెడ్యూల్ షూటింగ్ ఉందని సమాచారం. ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు. కొత్త డైరెక్టర్ తో మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడుగా కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే.. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాబోతుందని సమాచారం..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×