OTT Movie : ఈ శుక్రవారం (2025 అక్టోబర్ 31) రెండు బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఒకేసారి ఓటీటీలను షేక్ చేయబోతున్నాయి. అభిమానులు ఎప్పటినుంచో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలు, ‘కాంతారా: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (కన్నడ ఎపిక్) ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ (మలయాళ సూపర్ హీరో థ్రిల్లర్). ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జియో హాట్‌స్టార్‌లో రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ సినిమాలను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు థియేటర్స్‌లో రికార్డులు బద్దలు కొట్టిన చిత్రాలే. మొత్తం 1,000 కోట్లు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, థియేటర్స్‌లో 2025 అక్టోబర్ 2న విడుదలైంది. దాదాపు 800 వందల కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం (అక్టోబర్ 31) నుంచి కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ డబ్బింగ్ వెర్షన్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. రిషబ్ శెట్టి (డైరెక్టర్, రైటర్, లీడ్ రోల్), రుక్మిణి వాసంత్, గుల్షన్ దేవయా, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు, ఐయండిబిలో 8.5/10 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సినిమా 2022 హిట్ “కాంతారా”కి ప్రీక్వెల్. ఈ కథలో పంజూర్లి దైవం, కులశేఖర రాజు మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. ట్రైబల్ లీడర్ బెర్మే (రిషబ్ శెట్టి) రాజు అధికారానికి వ్యతిరేకంగా పోరాడతాడు. తమ భూములను కాపాడుకోవడానికి యుద్ధం చేస్తాడు.
Read Also : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్
చంద్ర’ : సూపర్‌హీరో ఫాంటసీ సినిమా థియేటర్స్‌లో 2025 ఆగస్టు 28న విడుదల అయింది. మలయాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో శుక్రవారం (అక్టోబర్ 31) నుంచి మలయాళం, తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ డబ్బింగ్ వెర్షన్స్ లో అందుబాటులోకి వస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది. ఐయండిబిలో దీనికి 8.1/10 రేటింగ్ ఉంది. ఈ కథ బెంగళూరులో అసాధారణ శక్తులతో బతికే చంద్ర (కల్యాణి ప్రియదర్షన్) ఒక మిస్టీరియస్ సూపర్ హ్యూమన్. ఆమె ఆర్గాన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌తో కనెక్ట్ అవుతుంది. ఆమె తన ఫ్యామిలీని ఈ గ్యాంగ్ వల్ల కోల్పోతుంది. దీంతో వాంపైర్ పవర్స్ తో రివేంజ్ తీర్చుకుంటుంది.