OTT Movie : కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం మోహన్ లాల్ నటించిన ‘ఎంపురాన్’ సినిమాను అధిగమించింది. ఇప్పుడు అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశపు మొట్ట మొదటి మహిళా సూపర్ హీరో మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఆగస్టు 28న థియేటర్లలో మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాను, తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలో అరుదైన రికార్డులు క్రియేట్ చేసింది.
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ (Lokah Chapter 1: Chandra). ఆగస్టు 28న మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా, ఆ తర్వాత తెలుగులో ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యున్నత విజయాన్ని సాధించింది. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ సినిమా మోహన్ లాల్ నటించిన ‘ఎల్2 ఎంపురాన్’ సినిమా రూ.266.81 కోట్ల కలెక్షన్లను అధిగమించింది. 2024లో విడుదలైన ‘మంజుమ్మేల్ బాయ్స్’ రూ.241.03 కోట్ల కలెక్షన్లతో మూడో స్థానంలో ఉంది. దీంతో 300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన తొలి మలయాళ చిత్రంగా ‘లోకా’ నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ‘లోకా’ సినిమా కేరళలో 100 కోట్లు వసూలు చేసి, మొత్తంగా భారతదేశంలో 183.67 కోట్లు, ఓవర్సీస్ వసూళ్లు రూ. 119.9 కోట్లతో ఈ రికార్డ్ కి చేరింది. 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఏకైక నటి కళ్యాణి ప్రియదర్శన్ నిలిచింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ‘జియో హాట్ స్టార్’ సొంతం చేసుకుంది. రేపటి నుంచి (అక్టోబర్ 31) ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Read Also : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి
చంద్ర అనే అమ్మాయి బెంగళూరులో రాత్రి పూట కాఫీ షాప్‌లో పని చేస్తుంది. ఆమె పక్క ఫ్లాట్‌లో సన్నీ, వేణు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సన్నీ చంద్రను చూసి ఇష్టపడతాడు. చంద్ర రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడికో వెళ్తుంటుంది. సన్నీ ఆమె రహస్యం తెలుసుకోవాలనుకుంటాడు. ఆ తరువాత చంద్ర వాంపైర్ అని, ఆమెకు సూపర్ పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఒక గ్యాంగ్ వల్ల ఆమె తన ఫ్యామిలీని పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ గ్యాంగ్ బెంగళూరులో ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తుంటారు. చంద్ర వాళ్లను ఆపాలనుకుంటుంది. వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. చివరికి ఆమె రివేంజ్ తీర్చుకుంటుందా ? ఆమె వాంపైర్ ఎలా అయింది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.