BigTV English
Advertisement

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Baahubali : తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అధ్యాయం బాహుబలి. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది. నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ప్రపంచ సినిమా చూస్తుంది అంటే దానికి కారణం బాహుబలి అనే సినిమా. సినిమా తర్వాతే తెలుగు సినిమా భారతీయ సినిమాగా మారిపోయింది.


అయితే బాహుబలి 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షోలు ఆల్రెడీ మొదలైపోయాయి. సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు. ఇక తాజాగా ఎస్ఎస్ రాజమౌళి కూడా హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ లో బాహుబలి సినిమాను చూస్తున్నారు. ఈ సినిమాను చూడడానికి వచ్చిన రాజమౌళి ప్రేక్షకులతో మాట్లాడారు.

జై మాహిష్మతి

నాతోటి మాహిష్మతి ప్రజలందరికీ శుభాభివందనాలు. మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి.? వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా? రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది.? ముసలవాడు ఏం చేయాలో తెలియక ఆ బిజ్జలదేవుడు అటూ ఇటూ తిరుగుతున్నాడు బాగానే ఉందా? నామీద బాహుబలి మీద ఎంతో ప్రేమ చూపించారు.


10 సంవత్సరాలైనా కూడా ఎక్కడా మీ ప్రేమ తగ్గలేదు మీ అభిమానం తగ్గలేదు. నా మాటల్లో మీ మీద ఉన్న ప్రేమను చెప్పలేను. మీ అందరికీ థాంక్యూ సో మచ్. మీకు నచ్చిన సీన్స్ అన్నీ కూడా ఉంచాను అని అనుకుంటున్నాను. జై మాహిష్మతి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని రాజమౌళి మాట్లాడారు.

స్పీచ్ తో సినిమా స్టోరీ

బాహుబలి సినిమా స్టోరీ ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ పాత్రలు అలా మైండ్ లో మెదులుతూ ఉంటాయి. పది సంవత్సరాల తర్వాత సినిమా చూసే ప్రేక్షకులకు ఆ సినిమాలోని పాత్రలను గుర్తు చేస్తూ మాహిష్మతి సామ్రాజ్యం గురించి మరోసారి రాజమౌళి చెప్పటం అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Related News

imran hashmi : తెలుగు సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు, అంత మాట అనేసవెంటి ఓమీ

Mamitha Baiju: అదృష్టం అంటే ఈ అమ్మాయి ఇదే, నచ్చిన స్టార్లతో అవకాశం

Narvini Dery: అజ్మల్ అలాంటివాడే.. ఆడిషన్ అని చెప్పి గదిలోకి పిలిచాడు.. హీరోపై నటి సంచలన కామెంట్స్‌

Baahubali The Epic :వెయిట్ చేయక్కర్లేదు, బాహుబలి చేంజెస్ కాకుండా ఇవి ఆడ్ చేశారు

Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Big Stories

×