Raashii Khanna Latest Photos: హీరోయిన్స్ అంటే సినిమాల్లో పాత్రలతోనే కాదు.. సోషల్ మీడియా పోస్టులతో కూడా ఆకట్టుకుంటూ ఉండాలి. ఆ విషయానికొస్తే.. రాశి ఖన్నా తన ఫోటోషూట్స్‌తో, ఆకట్టుకునే ఫోజులతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. (Image Source: Raashii Khanna/Instagram)
అసలైతే రాశి ఖన్నా బాలీవుడ్‌లోనే తన సత్తా చాటుకోవాలని అక్కడే నటిగా అడుగుపెట్టింది. కానీ అక్కడ మొదట్లో తనకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. అందుకే తెలుగులో వచ్చిన అవకాశాన్ని వెంటనే ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. (Image Source: Raashii Khanna/Instagram)
అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టింది రాశి ఖన్నా. ఆ మూవీలో తన యాక్టింగ్ ప్రేక్షకులతో పాటు ఇతర మేకర్స్‌ను కూడా ఆకట్టుకుంది. (Image Source: Raashii Khanna/Instagram)
‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత రాశి ఖన్నాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దాంతో కమర్షియల్ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా ప్రయోగాలు చేసింది. (Image Source: Raashii Khanna/Instagram)
తెలుగులో తనకు అవకాశాలు వచ్చినా, స్టార్‌డమ్ వచ్చినా రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్‌లో తనకు గుర్తింపు దక్కాలని కోరుకుంది. అలా మెల్లగా బీ టౌన్‌పై దృష్టిపెట్టింది. (Image Source: Raashii Khanna/Instagram)
రాశి ఖన్నాకు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయినా.. అక్కడ వెబ్ సిరీస్‌లో మాత్రం ఛాన్సులు కొట్టేసింది. అలా హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. (Image Source: Raashii Khanna/Instagram)
తాజాగా రాశి ఖన్నా.. ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. (Image Source: Raashii Khanna/Instagram)
తాజాగా ‘ది సబర్మతి రిపోర్ట్’ ప్రమోషన్స్‌లో భాగంగా వైట్ డ్రెస్సులో హొయలు పోతూ కనిపించింది రాశి ఖన్నా. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Image Source: Raashii Khanna/Instagram)