BigTV English

Ajahn Siripanyo: సన్యాసం కోసం.. రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన బిలీనియర్

Ajahn Siripanyo: సన్యాసం కోసం.. రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన బిలీనియర్

Ajahn Siripanyo: బంధాల్ని తెంచుకోవడం, ఆస్తుల్ని వదులుకోవడం, సన్యాసం స్వీకరించడం.. ఎవ్వరికీ అంత సులువు కాదు. పైగా.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకొని మరీ.. బౌద్ధ భిక్షువుగా మారడం మామూలు విషయం కాదు. కానీ.. అతను వదులుకున్నాడు. అతని పేరు.. అజాన్ సిరిపన్యో.. ఇతని లైఫ్ స్టోరీ.. ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది. లెక్కలేనన్ని వ్యాపారాలు, వేల కోట్ల సామ్రాజ్యం, తరాలు కూర్చొని తిన్నా.. తరగని ఆస్తి. ప్రీమియం లగ్జరీ లైఫ్. కానీ.. అవేవీ అతన్ని ఆకర్షించలేదు. విలాసాలన్నీ.. కొంతవరకే అని భావించాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అజాన్ సిరపన్యో.. అందులోనే తన నిజమైన ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఏకంగా 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి.. శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు. నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు.


ది మాంక్.. హూ సోల్డ్ హిజ్ ఫెరారీ పేరుతో రాబిన్ శర్మ రాసిన బుక్ గుర్తుందిగా! అందులో.. ఓ సక్సెస్‌ఫుల్ లాయర్ అయిన జూలియన్ మాంటిల్ గురించి రాశారు రాబిన్. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్వీకరించేందుకు.. తన ప్రాపంచిక ఆస్తుల్ని అమ్మేశారు. అయితే.. మాంటిల్ కథ కల్పితమే కావచ్చు. కానీ.. ఈ థాయ్-మలేషియన్ సన్యాసి వెన్ అజాన్ సిరపన్యో కథ మాత్రం కల్పితం కాదు. ఆధ్యాత్మిక జీవితం కోసం.. నిజ జీవితంలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేశాడు. ఈ అజాన్.. బిలియనీర్ ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడు. బౌద్ధ సన్యాసిగా మారేందుకు తన ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు.

అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ మలేషియాలో ఆరో అత్యంత ధనికుడు. ఆయన వ్యాపార సామ్రాజ్యం 5 బిలియన్ డాలర్ల పైనే ఉంటుంది. అంటే.. మన కరెన్సీలో 44 వేల కోట్ల పైమాటే. అజాన్ సిరిపన్యో.. బౌద్ధ సన్యాసిగా మారడం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. 18 ఏళ్ల వయసులో.. థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లారు అజాన్. ఆ టూర్.. అతని లైఫ్‌నే టర్న్ చేసింది.


Also Read: గూగుల్ మ్యాప్స్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు.. భారతదేశంలో కేసు!

అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి స్ఫూర్తిపొందాడు. సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ.. కొన్నాళ్లకు నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఏకంగా.. 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకుతున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గానికి.. ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్.. ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. ప్రాపంచిక సుఖాలను వదిలి.. బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయ్‌లాండ్-మయన్మార్ సరిహద్దుల్లో బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నారు.

లండన్‌లో పెరిగిన అజాన్.. అక్కడే చదువు పూర్తి చేశాడు. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా జీవనం సాగిస్తున్నా.. అప్పుడప్పుడూ తండ్రి ఆనంద్ కృష్ణన్‌ని కలిసేందుకు ప్రైవేట్ జెట్‌లో వెళ్తుంటాడనే ప్రచారం ఉంది. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త. టెలికాం, శాటిలైట్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. గతంలో ఎయిర్‌సెల్ పేరుతో టెలికం రంగంలో గుర్తింపు పొందారు. అంతేకాదు, ఒకప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్‌ కూడా! అలాంటి.. బిజినెస్ టైకూన్ కొడుకై ఉండి కూడా.. తండ్రి నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయాల సామ్రాజ్యాన్ని వదులుకొని.. ఆధ్యాత్మిక శాంతికోసం దాదాపు 20 ఏళ్లుగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×