Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తుంది.
విజయాపజయాలను పట్టించుకోకుండా రాశీ కన్నా ఇటు తెలుగు.. అటు హిందీ.. తమిళ్ అంటూ అన్ని భాషల్లో తన సత్తా చాటుతుంది.
ముద్దుగా బొద్దుగా ఉన్న రాశీ.. ఇప్పుడు బక్కచిక్కి కనిపిస్తుంది. చక్కన్నమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. ఈ చిన్నదాని అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో రాశీ సిద్దహస్తురాలిగా మారిపోయింది.
మొదటి నుంచి కూడా అందాల ఆరబోతలో కానీ, గ్లామర్ చూపించడంలో కానీ వెనుకాడలేదు రాశీ.
ఇక బాలీవుడ్ కు వెళ్ళాకా రాశీ రేంజ్ మారిపోయింది. ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు మంచి విజయాన్ని అందుకున్నాయి.
ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క ఫోటోషూట్స్ తో బిజీగా రాశీ.. తాజాగా సోషల్ మీడియాను మరోసారి హీట్ ఎక్కించింది.
వైట్ కలర్ కాలర్ నెక్ తో డిజైన్ చేసిన బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ను ధరించి ఫ్యాషన్ కు కొత్త కవిత్వాన్ని జోడించినట్లు చెప్పుకొచ్చింది రాశీ.
ప్రస్తుతం రాశీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రాశీ పుట్టడమే అందంగా పుట్టావా.. పెరుగుతూ అందంగా తయారయ్యావా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.