Ganja Batch: హైదరాబాద్‌లో అర్థరాత్రి గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చైతన్యపురి పీఎస్ పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. కొత్తపేట వద్ద యూటర్న్ చేస్తున్న క్రమంలో ఓ కారుకు బస్సు తగిలింది. దీంతో గంజాయి మత్తులో ఉన్న యువకులు వేంటనే బస్సు డ్రైవర్ పై దాడికి దిగారు. ఈ క్రమంలో బస్సుపై రాళ్లతో దాడి చేయగా బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డ్రైవర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఘటనాస్థలికి వచ్చే సరికి గంజాయి బ్యాచ్ అక్కడి నుండి పరార్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.