Bigg Boss 9 Telugu 9th Week Elimination: వీకెండ్ వచ్చేసింది. అంటే బిగ్ బాస్ ప్రియులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ రోజు హోస్ట్ నాగార్జున వచ్చి ఈ వారమంత కంటెస్టెంట్స్ ఆటపై ఆరా తీస్తారు. హౌజ్ లో వారు ఉన్న తీరు, చేసిన తప్పులకు గట్టి కోటింగ్ ఇస్తాడు. తొమ్మిదో వారం కెప్టెన్‌గా మరోసారి ఇమ్మాన్యుయేల్ అయిన సంగతి తెలిసిందే. వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. బాధ కూడా ఉంటుంది. ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుంచి బయటకు వస్తారు. అయితే ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉండబోతుంది.
అయితే ప్రతివారంలా ఒక్కరు కాదు ఇద్దరు హౌజ్‌ని వీడబోతున్నారట. తొమ్మిదో వారంలో వైల్డ్ కార్డ్‌గా వచ్చిన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అనే విషయం ఇప్పటికే లీకైపోయింది. ఓటింగ్స్ కూడా అవే చెప్పాయి. నామినేషన్‌లో ఉన్నవారిలో అందరికంటే తక్కువ ఓటింగ్ సాయికి వచ్చింది. దీంతో అతడు హౌజ్‌ని విడుతున్నాడనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే సాయితో పాటు మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అతడే రాము రాథోడ్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలుస్తోంది.
కాగా రాము రాథోడ్‌ని తన ఆట తీరుపై ప్రశ్నించగా తాను ఉండలేకపోతున్నానంటూ సెల్ఫీ ఎలిమినేషన్ అడిగాడట. దీంతో బాగ్ బాస్ టీం, హోస్ట్ ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్‌ని ఆమోదించారట. దీంతో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌తో సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ హౌజ్‌ని విడబోతున్నారు. కాగా ముందు నుంచి రాము రాథోడ్ హౌజ్‌లో యాక్టివ్‌గా ఉండటం లేదు. తొలివారం వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వారించడంతో తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చాక రాము మళ్లీ డల్ అయ్యాడు. టాస్క్‌లో తప్ప మరెక్కడ కనిపించడం లేదు. గత రెండు వారాలకు రాము రాథోడ్ టాస్కుల్లోనూ పెద్దగా ఆటడం లేదు.
Also Read: Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన హీరో!
ఏమన్న అంటే హోం సిక్ (Home Sick) అంటున్నాడు. హౌజ్ లోనూ ఎవరితో కలవండ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్కుల్లోనూ కంటెండర్ షిప్ గెలుచుకుని చివరిలో వదిలేశాడు. ఐదుగురిలో నలుగురే ఆడాలని బిగ్ బాస్ అనడంతో తన కోసం మాత్రం స్టాండ్ తీసుకోకుండ తనే స్వయంగా తప్పుకున్నాడు. ఈ విషయంలో తనూజ కూడా రాము వారించింది. అయినా వినిపించుకోకుండ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అంత రాము సరిగ ఆడటం లేదని, అతడిని ఎలిమినేట్ చేయాలని మిగతా కంటెస్టెంట్స్ ఫాలోవర్స్ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాము రాథోడ్ సెల్ఫీ ఎలిమినేషన్‌తో బయటకు రావడం అతడి ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తుంది. ఇక ఈ వారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.