ప్రయాణీకుల సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ప్రయాణీకులు PNR స్టేటస్ ను చెక్ చేయడానికి IRCTC యాప్ లేదంటే వెబ్ సైట్ మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మరింత ఈజీగా PNR స్టేసట్ తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంటర్నెట్ లేకపోయినా, ప్రయాణీకులు తమ ఫోన్ నుంచి SMS ద్వారా రైలు PNR స్థితిని చెక్ చేసుకోవచ్చు. MakeMyTrip సహకారంతో, WhatsApp ద్వారా కూడా PNR స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.
మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, ఫీచర్ ఫోన్ ఉపయోగించకపోయినా సింపుల్ గా PNR స్టేటస్ ను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే..
⦿ ఫోన్ లో మెసేజెస్ యాప్ కి వెళ్లి PNR అని టైప్ చేయాలి.
⦿ ఒక స్పేస్ ఇచ్చి మీ PNR నంబర్ ను రాయాలి.
⦿ ఉదాహరణకు మీ PNR నంబర్ 4758126582 అయితే, మీరు — PNR 4758126582 అని టైప్ చేయాలి.
⦿ ఆ తర్వాత ఈ మెసేజ్ ను 139 నెంబర్ కు మెసేజ్ పంపించాలి.
⦿ PNR స్టేటస్ కు సంబంధించిన వివరాలు మెసేజ్ రూపంలో అందుతాయి.
ఈ సర్వీసు ద్వారా, ప్రయాణీకులు ఇంటర్నెట్ లేకుండా వారి ప్రయాణానికి సంబంధించి అప్ డేట్ చేయబడిన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Read Also: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!
ఆన్‌లైన్‌లో PNR స్టేసట్ ను చెక్ చేయడానికి, ప్రయాణీకులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, www.indianrail.gov.in లేదంటే IRCTC వెబ్ సైట్, www.irctc.co.in ని ఓపెన్ చేసి టికెట్ PNR నంబర్‌ను ఎంటర్ చేస్తే, కొన్ని క్షణాల్లో, మీ సీటు, కోచ్, రైలు స్టేసట్, బుకింగ్ స్టేటస్ వివరాలన్నీ ఓపెన్ అవుతాయి.
గత సంవత్సరం, భారతీయ రైల్వే.. ప్రయాణీకులు WhatsApp ద్వారా వారి PNR స్టేటస్ ను చెక్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం, ప్రయాణీకులు ముందుగా 7349389104 నంబర్ ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత, WhatsAppను ఓపెన్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ ను రిఫ్రెష్ చేయాలి. ఆ తర్వాత ఈ నంబర్ మీ చాట్ లిస్ట్ లో కనిపిస్తుంది. ఈ నెంబర్ కు మీ PNR నంబర్ ను పంపించాలి. మెసేజ్ పంపిన వెంటనే మీ PNR స్టేటస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. మీరు ఈ నంబర్ సాయంతో రైలు కరెంట్ స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..