Siva karthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సెల్ఫ్ మేడ్ స్టార్స్ అంటే చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ అని చెప్పుకొస్తారు .. కోలీవుడ్ లో శివ కార్తికేయన్ కూడా అలాగే సెల్ఫ్ మేడ్ స్టార్. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక అతని జీవితాన్ని మార్చేసిన సినిమా రెమో. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తరువాత శివ కార్తికేయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో, మంచి మంచి కథలను ఎంచుకొని తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ ఏడాది ఆయన నటించిన అమరన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ లో ముకుంద్ గా శివ కార్తికేయన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది.
Pragya Jaiswal: ఈ అందాల ఆరబోతకు ఒక హిట్ పడితే బావుండు..
కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అమరన్ హిట్ తరువాత శివ కార్తికేయన్ మరో హిట్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు. గురు, ఆకాశం హద్దురా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర.. ఈ ఏడాది బాలీవుడ్ లో సర్ఫిరా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా సినిమాను సర్ఫిరా పేరుతో రీమేక్ చేసింది. ఈ సినిమా మాత్రం సుధాకు భారీ పరాజయాన్ని అందించింది.
ఇక ఎలాగైనా ఆమె మరో హిట్ కొట్టాలనే కసితో శివ కార్తికేయన్ తో జతకట్టింది. నేడు శివ కార్తికేయన్ 25 వ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోస్ జయం రవి, అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Naga Chaitanya Thandel : ఈసారి వచ్చేది శివుడి పాట
1965 లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో శివ కార్తికేయన్ విప్లవ భావాలు ఉన్న యువకుడుగా కనిపించనున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని టాక్ నడుస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందివ్వనున్నాడు.
ఇంతమంది స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ఈ హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.