Bhagya Shri Borse: ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల మొదటి ఛాయిస్ అంటేనే తక్కున అందరికీ భాగ్యశ్రీ పేరు గుర్తుకొస్తుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వివిధ భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు ఈమె నటించిన సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. త్వరలోనే మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni)భాగ్యశ్రీ (Bhagya Shri Borse)హీరో హీరోయిన్లుగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి యాంకర్ శ్రీముఖితో(Sreemukhi) ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రసారమవుతుంది. ఇందులో భాగంగా శ్రీముఖి భాగ్యశ్రీని కొన్ని ప్రశ్నలు వేశారు. మీకు కనుక రామ్ నుంచి ఏదైనా ఒక స్కిల్ దొంగలించే అవకాశం వస్తే ఎలాంటి స్కిల్ దొంగలిస్తారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఈమె తన డింపుల్స్(Dimples) అంటే చాలా ఇష్టమని పొంతన లేని సమాధానం చెప్పారు.
భాగ్యశ్రీ ఈ సమాధానం చెప్పడంతో వెంటనే శ్రీముఖి షాక్ అవుతుంది నేను అడిగింది స్కిల్ గురించి నాకైతే రామ్ ఎనర్జీ డాన్స్ అంటే చాలా ఇష్టం అంటూ శ్రీముఖి మాట్లాడటంతో నేను కూడా తన నుంచి తన ఎనర్జీని దొంగాలిస్తాను అంటూ సమాధానం చెప్పారు. అయితే భాగ్యశ్రీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ డింపుల్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా రామ్ భాగ్యశ్రీ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్న ఎక్కడ వీరిద్దరూ ఆ వార్తలను ఖండించిన దాఖలాలు లేవు.
ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర…
ఇక ఆంధ్ర కింగ్ సినిమా విషయానికి వస్తే.. మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో రామ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) నటించిన సందడి చేశారు. ఇక ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, రావు రమేష్, మురళి శర్మ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కానీ ఇతర అప్డేట్స్ సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్ ఈ సినిమాతో నైనా హిట్ కొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Actress Anandi: యాంకర్ సుమ సెట్ లో అలా ఉంటారా..అసలు విషయం చెప్పిన నటి!