Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ రెడీ అయిపోయింది. ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటికి మేము విడుదలైంది. అయితే ఎపిసోడ్ లో ముఖ్యంగా అందర్నీ ఆకర్షిస్తుంది నాగార్జున లుక్. గతంలో నాగర్జున మాస్ సినిమా గెటప్ వేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం శివ సినిమా గెటప్ లో దర్శనం ఇచ్చారు. కేవలం దర్శనం ఇవ్వడం మాత్రమే కాకుండా శివ సినిమాలోని బొటనీ పాట ఉంది పాటకు డాన్స్ చేశారు.
ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో నాగార్జునతో పాటు అక్కినేని అమలా కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన శివ సినిమా నవంబర్ 14న విడుదలవుతున్న సందర్భంగా ఇద్దరు స్టేజిపై సందడి చేశారు. అయితే ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కొంతమంది జంటగా కూడా స్టెప్పులు వేశారు.
ఇంకా ఆర్జీవి ఎక్కడ కనిపించినా కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం అనేది కామన్ అయిపోయింది. ఒకరకంగా చెప్పాలి అంటే కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. అయితే బిగ్ బాస్ హౌస్ లో నిన్ను వంద రోజులు ఉండమంటే ఏం చేస్తావు రాము అని నాగార్జున రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించారు.
దానికి సమాధానంగా సంజనా లాంటి అందమైన అమ్మాయిలు హౌస్ లో ఉంటే నేను ఉండిపోతాను అని చెప్పారు. అందరూ కూడా సంజన అంత అందంగా ఉండాలి అంటూ కామెంట్ చేశారు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకసారిగా ఆర్జీవి మాటలకు పడి పడి నవ్వారు.
అలానే శివ సినిమా గురించి టాపిక్ వచ్చింది. రాము రాథోడ్ రాంగోపాల్ వర్మను ఏదో అడిగే ప్రయత్నం చేశాడు ఎప్పటిలాగాని కౌంటర్ ఆన్సర్ ఇచ్చాడు ఆర్జీవి.
Also Read: Anchor Suma: 8 నెలల ప్రెగ్నెన్సీ తో కూడా యాంకరింగ్, ఆ ఇబ్బంది మర్చిపోలేను?
మామూలుగా ప్రతి వారం కూడా తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కొన్ని చిత్ర యూనిట్స్ హాజరవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు 14వ తారీఖున శివా సినిమా విడుదలవుతుంది కాబట్టి శివ చిత్ర యూనిట్ సందడి చేశారు.
ఈ ప్రోమోలో అమల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రీతు చౌదరి మీలాగా కామ్ గా మాట్లాడాలి అంటే అని ఏదో చెప్పబోయేలోపే నాగార్జున మధ్యలో కట్ చేసి నువ్వు మాట్లాడితే మా ఇంటి వరకు వినిపిస్తుంది నువ్వు అసలు కామ్ కాదు అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి ప్రోమో ఎపిసోడ్ మీద ఆసక్తిని కలిగిస్తుంది అని చెప్పాలి.