Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం ( IPL Auction 2025 ) మొన్న ముగిసింది. అయితే ఇందులో మెగా వేలానికి ( IPL Auction 2025 ) ముందు ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) ఐదుగురిని నిలబెట్టుకుంది. వేలంలో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ల కోసం కష్టాలు పడింది. అనుకున్నట్టుగానే ముంబై ఇండియన్స్ ( Mumbai Indians )తమ జట్టును నిర్మించుకున్నారు. జట్టులో భారీ హిట్టర్లు, పేసర్లు ఉన్నప్పటికీ మంచి స్పిన్నర్లను తమ జట్టులో చేర్చుకోవడంలో విఫలమైంది.
టీం ఇండియా టాపార్డర్లు అయినా బుమ్రా, రోహిత్ శర్మ సూర్య, కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలను అట్టి పెట్టుకున్న ముంబై ఇండియన్స్ వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది. అయితే జట్టును జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క భారతీయ అనుభవజ్ఞుడైన అయిన స్పిన్నర్ కూడా లేదు. మిచెల్ శాంట్నర్ ను జట్టులో చేర్చుకున్నప్పటికీ అతను విదేశీ స్పిన్నర్. మిచెల్ శాంట్నర్ మన పిచ్ లపై ప్రభావం చూపించడం అంత ఈజీ కాదు.
మెగా వేలంలో ముంబై ( Mumbai Indians ) మేనేజ్మెంట్ దీపక్ చాహార్, ట్రెంట్ బోల్ట్ లను కొనుగోలు చేసింది. పవర్ ప్లేలో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ లో ఇప్పటికే బమ్రా, హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరికి తోడు ఒక్క ఇండియన్ స్పిన్నర్ ఉంటే బౌలింగ్ దళం మరింత పటిష్టమయ్యేది. మెగా వేలంలో పేస్ ఎటాక్ ను పటిష్టం చేయడంపై ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే స్పిన్ విభాగాన్ని పట్టించుకోలేదు.
Also Read: D Gukesh – MS Dhoni: షాకింగ్.. ధోని కంటే ఎక్కువ టాక్స్ కడుతున్న గుకేశ్?
మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ కు ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే జట్టులో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లందరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన స్టార్ ప్లేయర్లే కావడం గమనార్హం. ఇక ముంబై ఇండియన్స్ జట్టును ( Mumbai Indians ) ఓసారి పరిశీలిస్తే జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమాన్ ధీర్, రాబిన్ మింజ్, కరన్ శర్మ, ట్రెంట్ బోల్ట్ , దీపక్ చాహార్, అల్లాహ్ గజాన్ఫార్, అశ్విని కుమార్, మిచెల్ శాంట్నర్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్ వంటి వారు ఉన్నారు.
ఇది ఇలా ఉండగా…. మొదటి ఐపీఎల్ 2024 టోర్నమెంటులో ( IPL Auction 2024 ) … కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను… తప్పించింది యాజమాన్యం. రోహిత్ శర్మ స్థానంలో… హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసింది ముంబై. అంతేకాదు ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కెప్టెన్ గా… హార్దిక్ పాండ్యాను నియామకం చేసింది యాజమాన్యం. కానీ గత సీజన్లో… హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడిన ముంబై అట్టర్ ఫ్లాప్ అయింది.