Sikindar: ఈ మధ్యకాలంలో చిత్రాలు ఎక్కువగా రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక సినిమా మాత్రం ఇప్పుడు కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తూ రీ ఎడిటెడ్ వర్షన్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ సినిమా ఏదో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya ) నటించిన సికిందర్ (Sikindar). సూర్య ఊర మాస్ లుక్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రాజు భాయ్ గెటప్ లో సూర్య నటించిన తీరు అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కథనం కాస్త నెమ్మదిగా ఉందనే విమర్శలు వచ్చినా.. ఆయన లుక్కుకి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఇకపోతే సినిమా స్లోగా ఉందనే కారణంతోనే అభిమానులు దీనిపై ఆసక్తి కనబరచలేదనే నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి (N. Linguswamy) ఈసారి ఎడిటింగ్ పై మరింత పదును పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనవసరమైన సాగదీత లేకుండా.. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కి ఇంకాస్త ఎక్కువ స్కోప్ ఇస్తూ సినిమాను పూర్తిగా ఒక కొత్త ఎంగేజింగ్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ డ్రామాను హైలైట్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్సిటీని పెంచేలా.. ఈ రీ ఎడిటెడ్ వెర్షన్ ఉంటుందని మేకర్స్ కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఇలా కొన్ని అంశాలను జోడిస్తూ.. అవసరంలేని సన్నివేశాలను తీసేస్తూ కొత్త వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సికిందర్.
మరోవైపు తాజాగా మేకర్స్ విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 28వ తేదీన ఈ సినిమా రీ ఎడిటెడ్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి అయితే మొదట విడుదలైనప్పుడు ప్రేక్షకులను మెప్పించలేని ఈ సినిమా ఇప్పుడు రీ ఎడిటెడ్ వెర్షన్ తో ఖచ్చితంగా భారీ సక్సెస్ అందుకుంటుందని డైరెక్టర్ భావిస్తున్నారు. మరి ఈ రీ రిలీజ్ లో ఈ సికిందర్ మూవీ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
also read:Andhra King Taluka: మూడు పాటలకు మూడు ప్రత్యేకతలు… రామ్ టాలెంట్ చూపించాడా ?
ఇకపోతే లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కారణంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను వేరే విధంగా ఎడిట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా.. అద్భుతమైన స్పందన లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ స్వయంగా వెల్లడించారు కూడా.. అందుకే ఈసారి కూడా తానే స్వయంగా ఎడిటింగ్ పనులను పర్యవేక్షించి.. సినిమాకి రెండో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. అందుకే అభిమానులను మెప్పించడానికి ఆయనే దగ్గరుండి మరీ ఇలా రీ ఎడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో బ్యాంగ్ బ్యాంగ్ పాటతో పాటు ఏక్ దో తీన్ పాటను కూడా కొత్త ఎడిటింగ్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా సినిమాలో యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవన్నీ వింటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరి థియేటర్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.