The Great Pre wedding show : రీసెంట్ టైమ్స్ లో చాలామంది దర్శకులు తమ సొంత కథలను చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఊహల్లో వచ్చిన కథలు కాకుండా తాము చూసిన పరిస్థితులను, వ్యక్తిత్వాలను గమనించి సినిమా కథలను తీయడం మొదలుపెట్టారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని సినిమాలు మంచిగా వర్కౌట్ అవుతున్నాయి.
తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమాలో కొన్ని పాత్రలు కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఈ సినిమాలో నరేంద్ర రవి అనే ఒక ఆర్టిస్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలో ఆనంద్ అనే క్యారెక్టర్ చేశాడు. సినిమా మొత్తంలో ఈ పాత్రే హైలైట్. కొన్ని సందర్భాల్లో హీరో పాత్రను కూడా డామినేట్ చేసేలా ఉంది. శ్రీకాకులం యాసలో ఉంటుంది ఆ పాత్ర. కానీ, అతను హైదరాబాదీ అని రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్లో చెప్పాడు.
ఒక ప్రాంతపు యాసను మాట్లాడటం అనేది అంత సులువైన పని కాదు. దానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. రీసెంట్ టైమ్స్ లో సినిమాల్లో తెలంగాణ యాస బాగా కనిపిస్తుంది. మరోవైపు కొందరు దర్శకులు ఉత్తరాంధ్ర యాసను కూడా సినిమాల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు ఉత్తరాంధ్ర యాస కూడా బాగా పాపులర్ అవుతుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో కూడా అదే యాసను మాట్లాడుతున్నాడు. ఇక తాజాగా నరేంద్ర రవి మాట్లాడిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రాహుల్ రామకృష్ణ, పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శి పాపులర్ అయినట్లు ఈ సినిమాతో నరేంద్ర రవి బాగా పాపులర్ అయిపోతాడు అని చెప్పాలి.
మరోవైపు ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా వెబ్సైట్లు కూడా త్రీ రేటింగ్ ఇస్తున్నాయి. ఇకపోతే తిరు వీర్ అద్భుతమైన కథలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతున్నాడు. తను చేసిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు కానీ మంచి పేరును మాత్రం తీసుకొస్తున్నాయి. మరోవైపు విలన్ పాత్రలు కూడా వేసి మెప్పించిన విషయం తెలిసిందే.
Also Read: Anchor Suma: 8 నెలల ప్రెగ్నెన్సీ తో కూడా యాంకరింగ్, ఆ ఇబ్బంది మర్చిపోలేను?