Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
Rahul Sipligunj-Harinya Photos: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన హరిణ్య రెడ్డిని గత ఆగష్టులో నిశ్చి తార్థం చేసుకున్నారు.

Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
ఈ అక్టోబర్ నెల చివరిలో వీరి పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ముహుర్త తేదీ దగ్గరపడుతుందండటంతో వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి. తాజాగా లగ్నపత్రికకి సంబంధించిన శభకార్యక్రమం జరిగింది.

Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
ఇందుకు సంబంధించిన ఫోటోలను హరిణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని షేర్ చేస్తూ లగ్నపత్రిక వచ్చేస్తోందని చెప్పింది. ఇందులో రాహుల్, హరిణ్యలు పసుపు దచ్చుతూ కనిపించారు.

Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
ఇందులో వీరిద్దరిని చూసి చూడముచ్చటటైన జంట అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్, హరిణ్యలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి.

Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
కాగా రాహుల్ సిప్లిగంజ్ మొదట మాస్ సాంగ్స్‌తో ఫేమస్ అయ్యాడు. ప్రైవేట్ అల్బమ్‌తో గుర్తింపు పొందిన రాహుల్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాస్తు బాగుందే, రంగ రంగ రంగస్థలానా, బొమ్మోలే ఉందిరా పోరి వంటి పాటలు పాడాడు.

Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ పాడి ఊర్రతలూగించాడు. ఈ పాట ఆస్కార్‌కి వెళ్లడం రాహుల్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం సినిమాల, ప్రైవేట్ అల్భమ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Rahul Sipligunj-Harinya (Source: harinya_reddyy/Instagram)
ఇక రాహుల్ కాబోయే భార్య హరిణ్య కూడా ఇండస్ట్రీ వ్యక్తే. బిగ్ బాస్ షో టైంలో ఇద్దరికి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్ద అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యారు.