సాయంత్రం అయితే చాలు చాలా మంది పానీపూరీ బండి ముందు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జమ అవుతారు. భయ్యా తోడా ప్యాజ్ దాలో అంటూ నచ్చినన్ని పానీపూరీలు లాగించేస్తారు. సాధారణంగా రూ. 10 రూపాయలకు 2 నుంచి 4 పానీ పూరీలు ఇస్తారు. హ్యాపీగా తినేసి వచ్చేస్తారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పానీపూరీ చాలా చాలా స్పెషల్. ఇది హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైనది. ఒక్క ప్లేట్ కాస్ట్ ఏకంగా రూ. 1500. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఇంత కాస్ట్ లీ పానీ పూరీ ఎక్కడ అమ్ముతున్నారు? దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత ధర పలుకుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హైదరాబాద్ లో సత్వ నాలెడ్జ్ సిటీ, గేట్ నెంబర్ 11 నుంచి లోపలికి అడుగు పెడితే తేవర్- ది ప్రొగ్రెసివ్ ఇండియన్ కిచెన్ & బార్ ఉంటుంది. ఇందులో స్పెషల్ డిష్ గా పానీపూరీ అందిస్తున్నారు. ప్లేట్ పానీపూరీ కాస్ట్ ఇక్కడ రూ. 1500. ఇందులో పానీపూరీతో పాటు ఇచ్చే పానీలో వోడ్కాను కలిపి ఇవ్వడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన పానీపూరీగా తేవార్ పానీపూరీ గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ‘తిండిబోతు’ సాయి అఖిత్ తేవార్ పానీపూరీ గురించి ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే, మరికొంత మంది అవసరమా? అంటూ కామెంట్ చేస్తున్నారు. “పైత్యం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి నచ్చినని పానీ పూరీలు తిన్నా ఇంత బిల్ కాదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఈ పానీపూరీ తినడానికి లీగల్ ఏజ్ ఏమైనా ఫిక్స్ చేశారా?” అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. మొత్తంగా ఈ పానీపూరీ గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
https://www.instagram.com/thindibothu.in/reel/DQEnDWxD20L/
Read Also: ఏసీలో ఎక్కువ సేపు గడిపితే.. ఎప్పటికి ముసలోళ్లు అవ్వరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?
హైదరాబాద్ లో రోడ్ సైడ్ తక్కువ ధరలకే పానీపూరీ లభించినప్పటికీ, కొన్ని రెస్టారెంట్లలో దీని ధర చాలా ఎక్కువగా ఉంది. హిమాయత్ సాగర్ లోని మసాలా రిపబ్లిక్ బై దాడు’స్ (Masala Republic by Dadu’s)లో రెండు రకాల పూరీలు (ఒకటి క్రిస్పీ, మరొకటి సాఫ్ట్ అండ్ క్రిస్పీ), రెండు రకాల పానీలు (జల్ జీరా, మాంగో ఫ్లేవర్డ్) లభిస్తాయి. స్లయిడర్ స్టైల్‌లో సర్వ్ చేస్తారు, ఫ్యూజన్ చాట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ ప్లేట్ (4-6 పీసులు) ధర రూ. 250 నుంచి రూ. 350 ఉంటుంది.
Read Also: ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు.. తినే ప్లేట్లకూ పే చేయాలట, భలే విచిత్రంగా ఉందే!