E-Paper
Advertisement

Peddi : పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే, చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Peddi : పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే, చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Advertisement

Peddi : రామ్ చరణ్ అభిమానులతో పాటు చాలామంది తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు అని అనౌన్స్ చేయగానే క్యూరియాసిటీ మరింత పెరిగింది. మొత్తానికి ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ అనే వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ ఆటిట్యూడ్, మాట్లాడే లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి.

రంగస్థలం సినిమాలో గోదావరి యాసను అలా ఒకగా మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చరణ్. ఇప్పుడు పెద్ది లో చరణ ఉత్తరాంధ్ర యాసను మాట్లాడుతుంటే అది కూడా చాలా అందంగా వినిపిస్తుంది. చిట్టిబాబు ను మించి ఈ పాత్ర ఉండబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ సినిమా మార్చ్ 25న ప్రీమియర్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా రిలీజ్ డేట్ ను మార్చ్ 27 అని ప్రకటించారు.

ఫస్ట్ సింగిల్ అప్డేట్ 

Advertisement

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాకి సంగీతం అందించి చాలా రోజులైపోయింది. హనుమాన్ సంగీతం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ సిద్ధం అయినట్లు బుచ్చిబాబు వాళ్ళ సందర్భాల్లో చెప్పాడు.

నవంబర్ 8న పెద్ది సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అయితే ఇదొక డ్యూయెట్ సాంగ్ అని బుచ్చిబాబు చెప్పాడు. బుచ్చిబాబు ఉప్పెన సినిమాకు సంబంధించి మొదటి పాటను కూడా అద్భుతంగా కంపోజింగ్ చేయించుకున్నాడు. ఆ పాట వలనే సినిమాకు హైప్ వచ్చింది.

ఈ పాటతో హైప్ 

Advertisement

ఉప్పెన సినిమా మాదిరిగానే పెద్ది సినిమాకి కూడా ఫస్ట్ సింగిల్ తో మంచి హైప్ వస్తుంది అని అందరూ భావిస్తున్నారు. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇంకొద్ది రోజుల్లో పెద్ది సినిమా నుంచి మొదటి పాట విననున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×