Telangana Liquor Shop: తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుల కోసం భారీగా ధరఖాస్తులు నమోదు అయ్యాయి. మొత్తం 2620 మద్యం షాపుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 95,137 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 23 వరకు పొడిగించడం వల్ల.. చివరి రోజు వరకూ భారీగా దరఖాస్తులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 4,822 దరఖాస్తులు అందాయి. ఓబీసీ బంద్, ప్రభుత్వ రవాణా బస్సులు నడవకపోవడం, కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడటం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గడువు పెంచిన విషయం తెలిసిందే.
ఎక్కువ దరఖాస్తులు రంగారెడ్డి డివిజన్‌లో
రాష్ట్రంలోని అన్ని ఎక్సైజ్ డివిజన్‌లలో.. రంగారెడ్డి డివిజన్ అత్యధికంగా 29,420 దరఖాస్తులు రాగా, అదిలాబాద్ లో కేవలం 4,154 దరఖాస్తులు మాత్రమే అందాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం.
జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు
మొత్తం 95,137 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
మద్యం షాపుల కేటాయింపుల కోసం డ్రా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు నిర్వహించబడనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్‌లు, దరఖాస్తుదారుల సమక్షంలో ఈ డ్రా చేపడతారు. ఎంపికైన వారికి లైసెన్సుల కేటాయింపు విధానం పూర్తి పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రతి షాపుకు దాదాపు 35 మందికి పైగా పోటీదారులు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. బిజినెస్ వ్యాపార లాభదాయకతను దృష్టిలో ఉంచుకొని ఈసారి దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. కొత్త పాలసీ కింద మద్యం షాపుల సంఖ్య 2620కే పరిమితం చేయడంతో పోటీ మరింత పెరిగింది.
కొత్త లైసెన్సు పాలసీలో మార్పులు, గత లైసెన్సు హోల్డర్ల లాభాలు వంటి అంశాలు ఈసారి దరఖాస్తుల పెరుగుదలకు కారణమయ్యాయని అధికారులు భావిస్తున్నారు. డ్రా ప్రక్రియ పూర్తైన తర్వాత లైసెన్సులు నవంబర్ మొదటి వారంలోనే జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ