Lokesh Kanagaraj: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వరుస హిట్ సినిమాల ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల రజనీ కాంత్ హీరోగా నటించిన కూలి(Coolie) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజనీకాంత్ మరో సినిమా చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కోసం లోకేష్ భారీ యాక్షన్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ కథ రజనీకాంత్ కు వినిపించడంతో రజనీకాంత్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
డైరెక్టర్ లోకేష్ ఈ కథను నెరేట్ చేసిన విధానం రజనీకాంత్ కు నచ్చని నేపథ్యంలో ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా రజినీకాంత్ డైరెక్టర్ లోకేష్ తో తిరిగి సినిమా చేయడానికి ఆసక్తి చూపించని నేపథ్యంలో దర్శకుడు లోకేష్ తిరిగి తన సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగు పెట్టారు. ఇప్పటికే తన సినిమాటిక్ యూనివర్స్ ద్వారా పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా ప్రముఖ నటుడు కార్తి(Karthi) నటించిన చిత్రం ఖైతీ(Kaithi). ఈ సినిమా తెలుగులో ఖైదీ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
లోకేష్ కనకరాజు రజనీకాంత్ సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఖైదీ 2 షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని అందరూ భావించారు కానీ ఇప్పుడు రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ సినిమాని రిజెక్ట్ చేసి నెల్సన్ దిలీప్ కుమార్ తో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే లోకేష్ తిరిగి కార్తి హీరోగా చేయాల్సిన ఖైదీ 2 పనులను ప్రారంభించారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్టు సమాచారం.
ఖైదీ 2 లో అనుష్క..
ఇక రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఇదివరకు జైలర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కాకుండా రజినీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతోందనే, ఈ సినిమా పనులలో రజినీకాంత్ బిజీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాల గురించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించాల్సి ఉంది. ఇక ఖైతి 2 సినిమాలో అనుష్క భాగం కాబోతోందని ఇదివరకు వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాలి అంటే లోకేష్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Also Read: Ramgopal Varma : స్పిరిట్ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ రియాక్షన్.. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసంటూ!