
Rukmini Vasanth (Source: Instagram)
Rukmini Vasanth in Purple Saree: ఒక్క సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది కన్నడ భామ రుక్మిణి వసంత్. ఆమె నటించిన సప్తసాగరాలు మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

Rukmini Vasanth (Source: Instagram)
రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాలో సాధారణ ప్రేమికురాలిగా తనదైన నటతో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కన్నడ, తెలుగులో ఆమె పేరు మ్రోగింది.

Rukmini Vasanth (Source: Instagram)
ఆ తర్వాత కాంతార: చాప్టర్ 1తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాతో ఈ భామ పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తోంది.

Rukmini Vasanth (Source: Instagram)
ఇందులో రిషబ్ శెట్టి నటన కోసం అందరూ ఎదురుచూస్తున్నప్పటికీ, రుక్మిణి పాత్ర మాత్రం సెంటార్ అట్రాక్షన్‌గా ఉందనడంలో సందేహం లేదు.

Rukmini Vasanth (Source: Instagram)
ప్రస్తుతం కాంతార హిట్ జోష్‌లో ఉన్న ఈ భామ తరచూ తన ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా పర్పుల్ శారీలో సంప్రదాయ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇందులో ఆమె లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Rukmini Vasanth (Source: Instagram)
ఏమా అందం ఏమా అందంటూ ఆమెను కుర్రాళ్లంత పాట పాడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.