Jobs in RITES: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్స్ సర్వీసెస్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిప్లొమా, బీఎస్సీ పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీస్ నుంచి 600 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 12న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 600
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీస్ లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: డిప్లొమా, బీఎస్సీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 14
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 12
ఎగ్జామ్ తేది: నవంబర్ 23
వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు దాటరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు ప్రారంభ వేతనం రూ.29,735 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://rites.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 600
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 12
ALSO READ: డిగ్రీ అర్హతతో ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్