సంవత్సరాలు గడిచేకొద్దీ.. యుద్ధం తీరు మారుతుంది. తరాలు గడిచేకొద్దీ.. వ్యూహం మారుతుంది. టెక్నాలజీ పెరిగేకొద్దీ.. శత్రువుని దెబ్బతీసేందుకు.. వారి రహస్యాలను దొంగిలించే పద్ధతి మారుతుంది. అలా.. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్‌లోకి వచ్చిందే.. సెక్స్ వార్ ఫేర్. ఎస్.. సిలికాన్ వ్యాలీలో నడుస్తున్న సరికొత్త గూఢచర్యం ఇది. వలపు వల విసిరి.. దిగ్గజ టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లని దొంగిలించేస్తున్నారు. అసలు.. ఇదంతా ఎలా జరుగుతోంది? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు?
అన్నింట్లో తామే ముందున్నామని విర్రవీగే అమెరికా.. ఈ విషయంలో మాత్రం చాలా వెనుకబడింది. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా టైమ్ తీసుకుంది. దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉండే.. సిలికాన్ వ్యాలీలో.. అకస్మాత్తుగా సెక్స్ వార్‌ఫేర్ పెరిగిపోయింది. చైనా, రష్యాకు చెందిన ఆపరేటర్లు.. టెక్ కంపెనీల్లోకి చొరబడేందుకు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు, అక్కడి ట్రేడ్ సీక్రెట్స్‌ని.. దొంగిలించేందుకు అందమైన, ఆకర్షణీయమైన మహిళలను వాడుతున్నట్లు తేలింది. ఇదే.. ఇప్పుడు అందరినీ షాక్‍కి గురిచేస్తోంది. అంతేకాదు.. ఓ గూఢచారి మహిళ.. ఓ టెకీని పెళ్లి కూడా చేసుకుంది. ఆమెను.. అతను ఓ మీటింగ్‌లో కలిశాడు. ఆమె అందమైనదే కాదు.. ఎంతో తెలివైంది కూడా. అతనంటే నిజంగానే ఎంతో ప్రేమ ఉన్నట్లు, ఇష్టం ఉన్నట్లు నమ్మించింది. కొన్నేళ్ల తర్వాత.. ఆమె ఓ ఇంటలిజెన్స్ ఆపరేషన్‌లో భాగమని, అమెరికా వాడే టెక్నాలజీ నుంచి అనేక రహస్యాలను తెలుసుకునేందుకు వచ్చిందని.. తెలుసుకున్నాడు. ఇదే.. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో నడుస్తున్న లేటెస్ట్ స్పై ఆపరేషన్.
చైనా, రష్యాకు చెందిన కొందరు ఆపరేటర్లు.. అమెరికా టెక్ కంపెనీల్లోకి చొరబడి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు అందమైన మహిళల్ని ఎరగా వాడుతున్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో.. ఆ గూఢచారి మహిళలు.. తమ టార్గెట్లను పెళ్లి కూడా చేసుకుంటారు. టెక్నాలజీపరమైన రహస్యాలను దొంగిలించే క్రమంలో.. ఎక్కువ కాలం వారితో ఉండాల్సి వచ్చినప్పుడు.. పిల్లలను కూడా కంటారు. అందుకోసమే.. ఇంటలిజెన్స్ ఎక్స్‌పర్ట్స్ దీనిని సెక్స్ వార్‌ఫేర్ అని పిలుస్తున్నారు. ఇదంతా.. టెక్ ప్రపంచంలో పెరుగుతున్న అమెరికా ఆధిపత్యానికి ముప్పును సూచిస్తోందని చెబుతున్నారు. చైనాలో పెట్టుబడులు పెట్టే.. అమెరికా కంపెనీలకు సలహాలు ఇచ్చే నిపుణులు.. దీనిని గమనించారు. లింక్డ్ ఇన్ లాంటి ప్లాట్ ఫామ్స్‌లో.. అందమైన యువతుల నుంచి తమకు రిక్వెస్ట్‌లు వస్తున్నాయంటున్నారు. ఈ మధ్యకాలంలో సిలికాన్ వ్యాలీలో ఈ తరహా గూఢచర్యం బాగా పెరిగిందని కౌంటర్ ఇంటలిజెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల.. చైనా పెట్టుబడి నష్టాలపై వర్జీనియాలో జరిగిన వ్యాపార సమావేశంలోనూ.. ఇద్దరు ఆకర్షణీయమైన చైనీస్ లేడీస్ ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇది.. కచ్చితంగా అమెరికా ఇంటలిజెన్స్ వైఫల్యమే అంటున్నారు.
అయితే.. సెక్స్ బేస్డ్ గూఢచర్యం ఇప్పుడున్న ముప్పులో ఓ పార్ట్ మాత్రమే. యూఎస్ బిజినెస్ ప్లాన్స్‌ని సేకరించేందుకు.. చైనా అమెరికా గడ్డపై స్టార్టప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్‌కి.. రష్యా, చైనా.. తమ దేశ పౌరులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, క్రిప్టో అనలిస్టులను.. అనధికార నిఘా ఏజెంట్లుగా వాడుతుండటం వల్ల.. ఈ కార్యకలాపాలను గుర్తించడం కష్టతరమవుతోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు.. అందమైన తమ దేశపు మహిళలకు.. ఓ టార్గెట్‌ని సెలక్ట్ చేయడం, వారిని పెళ్లి చేసుకోవడం.. ఓ లక్ష్యంతో పిల్లల్ని కనడం, జీవితాంతం.. టెక్ సీక్రెట్స్ సేకరించే ఆపరేషన్ నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల.. అస్సలు అనుమానమే వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఈ విధంగా.. మేధో సంపత్తిని దొంగిలించేందుకు.. ఏడాదికి 600 బిలియన్ డాలర్ల దాకా ఖర్చవుతోంది. ఇదంతా.. ఎక్కువగా చైనా నుంచే జరుగుతోంది. స్టార్టప్‌లు.. చైనా ఇన్వెస్టర్లతో తమ బిజినెస్ ప్లాన్స్‌ని పంచుకుంటే.. రహస్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది. లేనిపక్షంలో.. వాళ్లు చైనాకే వెళ్లాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉంది.
సిలికాన్ వ్యాలీ.. ఇప్పుడు సాఫ్ట్ ఎకనమిక్ గూఢచర్యానికి కేంద్రంగా మారింది. టెక్నాలజీతో పాటు ట్రేడ్ సీక్రెట్స్‌ని కూడా టార్గెట్‌గా చేసుకుంది. చైనా దీనిని.. డ్రాఫ్ట్‌గా పిలుస్తోంది. యూఎస్ యాక్సెస్‌ని నిరోధించేందుకు.. డీవోడీ నిధులతో కూడిన స్టార్టప్‌లలో వాటాలు కొనుగోలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీ ఓపెన్ కల్చర్ కూడా గూఢచారులు ఎంట్రీ ఇచ్చేందుకు.. రూట్ క్లియర్ చేస్తోంది. సౌత్ కొరియా, ఇజ్రాయెల్ లాంటి అమెరికా మిత్రదేశాలు కూడా.. సైలెంట్‌గా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంటాయని.. ఇంటలిజెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఈ సరికొత్త వార్‌ఫేర్‌తో.. టెక్నాలజీ పరంగా అమెరికా ఎంతలా నష్టపోతోంది? యూఎస్ మేధో సంపత్తిని దొంగిలించడం వల్ల.. అమెరికాకు ఎన్ని బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది? ఈ తరహా గూఢచర్యానికి.. అమెరికా గనక చెక్ పెట్టకపోతే.. భవిష్యత్తుల్లో టెక్ రంగంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? ఇంటలిజెన్స్ నిపుణులు ఏం చెబుతున్నారు? అమెరికా దగ్గరున్న.. కౌంటర్ ఇంటలిజెన్స్ ప్లానేంటి?
సిలికానీ వ్యాలీలో.. చైనా, రష్యా గూఢచర్యం ఎంతో అభివృద్ధి చెందిందనే రిపోర్టులు.. అమెరికాని టెన్షన్ పెడుతున్నాయ్. కోల్డ్ వార్ నిఘా నుంచి.. వెంచర్ క్యాపిటల్, టెక్ స్టార్టప్‌లలోకి చోరబడటం దాకా.. ఈ రెండు దేశాల స్పై ఆపరేషన్లు పెరిగాయ్. 2017లో రష్యన్ కాన్సులేట్ మూసివేసిన తర్వాత కూడా.. రష్యా హానీపాట్స్, మధ్యవర్తులను ఉపయోగిస్తోంది. ఇక.. చైనా అయితే.. టెక్నాలజీ, ఐపీ అడ్రస్‌వ కోసం.. ఓ భారీ వలనే విసురుతోంది. ఈ విషయంలో.. యూఎస్ కౌంటర్ ఇంటలిజెన్స్ అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఎందుకంటే.. స్టార్టప్స్ తరచుగా బెదిరింపులను తక్కువగా రిపోర్ట్ చేస్తాయ్. మరోవైపు.. సిలికాన్ వ్యాలీలోని ఓపెన్ కల్చర్.. స్పై ఆపరేషన్లను సులభతరం చేస్తోంది. అందువల్లే.. చైనా, రష్యా.. హానీ ట్రాప్ పద్ధతుల్లో.. దిగ్గజ టెక్ కంపెనీల నుంచి ట్రేడ్ సీక్రెట్స్ దొంగిలిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయ్. బడా టెక్ కంపెనీల్లో.. విలువైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగే వారిని.. ప్రేమలోకి దించడం గానీ, వలపు వల విసరడం గానీ చేసి.. తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. తమ సంబంధాలతో.. మేధో సంపత్తి, మిలటరీ టెక్నాలజీతో పాటు ఇతర రహస్య సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా.. గూఢచర్యం చేస్తున్నారు.
ముఖ్యంగా.. చైనా.. అమెరికన్ టెక్నాలజీని, వాణిజ్య అభివృద్ధికి ఉపయోగపడే వాటిని అక్రమంగా సంపాదించడంలో.. చైనా అత్యంత చురుకైన విదేశీ శక్తిగా కనిపిస్తోంది. విద్యార్థులు, పరిశోధకుల ముసుగులో గూఢచర్య కార్యకలాపాలు జరుపుతోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయ్. ఇందుకోసం.. యూఎస్ పొలిటీషియన్స్‌తోనూ విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు.. రష్యా కూడా యూఎస్‌లో గూఢచర్యం విషయంలో సీరియస్‌గా కనిపిస్తోంది. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ స్టార్టప్‌లలోకి చొరబడటంపై ఫోకస్ పెట్టింది. టెక్నాలజీ పరమైన రహస్యాలను దొంగిలించేందుకు.. చైనా, రష్యా సిలికాన్ వ్యాలీనే సెలక్ట్ చేసుకోవడానికి ఓ రీజన్ ఉంది. ఇక్కడ.. సెమీ కండక్టర్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా.. కీలకమైన టెక్నాలజీలన్నింటిని.. సిలికాన్ వ్యాలీ సెంటర్‌గా ఉంది. ఇలా.. మేధో సంపత్తి దొంగతనం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు.. ఏడాదికి కొన్ని వందల బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.
హానీ ట్రాప్, సెక్స్ వార్‌ఫేర్ లాంటి గూఢచర్య పద్ధతులు.. టెక్ కంపెనీల్లో ఇంటర్నల్ టెన్షన్స్‌ని పెంచుతాయ్. సంస్థలకు తీవ్రమైన ఆర్థిక, జాతీయ భద్రతా నష్టాలను కలిగిస్తాయ్. ఇలాంటి ఎన్నో రిపోర్ట్స్, న్యూస్.. పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పటికీ.. జనంలో చర్చ జరిగినప్పటికీ.. గూఢచర్యాన్ని ఆపడం కష్టమవుతుంది. ఎందుకంటే.. స్పై ఆపరేషన్లన్నీ.. చాలా సీక్రెట్‌గా జరుగుతుంటాయ్. దొంగిలించబడిన మేధో సంపత్తితో.. విదేశీ ప్రత్యర్థులు.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఖర్చు లేకుండా.. దాదాపు ఒకే తరహా ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయిస్తారు. దీనివల్ల.. అమెరికన్ కంపెనీల మార్కెట్ వాటా తగ్గిపోతుంది. మిలటరీకి సంబంధించిన సున్నితమైన టెక్నాలజీ దొంగిలించడం వల్ల.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల.. FBIతో పాటు ఇతర గూఢచార సంస్థలు.. సిలికాన్ వ్యాలీతో పాటు తమ డిఫెన్స్ పరిశ్రమలపైనా నిఘా పెంచాయి. ముఖ్యంగా.. ఈ తరహా సరికొత్త వార్‌ఫేర్‌ని నిరోధించేందుకు చురుగ్గా పనిచేస్తున్నాయ్. ఇప్పటికే.. చైనాకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు గూఢచార కార్యకలాపాలు చేస్తున్నారని అనుమానం వచ్చిన వారి వీసాలను అమెరికా రద్దు చేసింది.
మరోవైపు.. దిగ్గజ టెక్ కంపెనీలన్నీ.. ఉద్యోగులతో పాటు కొత్తగా జాబ్స్ కోసం అప్లై చేసిన వారికి సంబంధించి.. తనిఖీలను కఠినతరం చేశాయ్. చైనా లింకులున్న వారి పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయ్. ముఖ్యంగా.. సైబర్ చొరబాట్లను అరికట్టేందుకు.. కంప్యూటర్ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాయ్. తమ సిబ్బందికి కూడా హానీ ట్రాప్ లాంటి గూఢచర్య వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు.. ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హనీ ట్రాప్ ప్రయత్నాలను గుర్తించేందుకు ఏఐ, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను డెలవప్ చేస్తున్నారు. విదేశీ గూఢచారుల నుంచి అమెరికన్ ఆస్తులను, మేధో సంపత్తిని, టెక్నాలజీని కాపాడుకునేందుకు.. అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
Story by Big Tv