Tirumala Tickets: తిరుమల శ్రీవారిని నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) జనవరి కోటా రేపు(అక్టోబర్ 25)న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుమల, తిరుపతి వసతి గదుల బుకింగ్ రేపు మధ్యాహ్నం 03:00 గంటలకు అందుబాటులో ఉంటుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200) టికెట్లు నవంబర్ కోటా రేపు ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
తిరుమలలో అక్టోబర్ 25న నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే అని పండితులు తెలిపారు.
తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరదనీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.
Also Read: Trolling On Jagan: బీకామ్‌లో ఫిజిక్స్.. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!