Mohan Lal: మలయాళం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న మోహన్ లాల్ (Mohan Lal) కి తాజాగా కేరళ కోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. విషయంలోకి వెళ్తే.. ఆయన సేకరించిన ఏనుగు దంతాలను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కేరళ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టి వేసింది. అలాగే మోహన్ లాల్ కు జారీ చేసిన లైసెన్స్ ను కూడా రద్దు చేసింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన నిబంధనలను అనుసరించి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలి అంటూ కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు విషయంలోకి వెళ్తే..2011 డిసెంబర్ 21న కొచ్చిలోని తేవరలో ఉన్న మోహన్ లాల్ ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా.. అప్పుడు ఆయన ఇంటిలో రెండు జతల ఏనుగు దంతాలు, 13 ఐవరీ వస్తువులు లభించగా వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మోహన్ లాల్ పై కేసు నమోదు చేసింది. 2016లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ షిప్ సర్టిఫికెట్ జారీ చేసి , కేసును ఉపసంహరించుకోవాలని ప్రయత్నించింది. కానీ పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు దీనిని తిరస్కరించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మోహన్ లాల్ హైకోర్టును ఆశ్రయించగా.. అదే సమయంలో జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అటు మోహన్ లాల్ కు ఇచ్చిన ఓనర్ షిప్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Big TV Kissik talks Promo: ఆ హీరో పక్కన ఐటమ్ సాంగ్ చేస్తానంటున్న కస్తూరి.. కోరిక మామూలుగా లేదుగా!
మలయాళం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన.. మలయాళ సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా చలామణి అవుతున్నారు. తన అద్భుతమైన నటనతో ఏకంగా 6 నేషనల్ అవార్డులను అందుకున్నారు స్పెషల్ అవార్డుల విభాగంలో 4 విభాగాలలో అవార్డు, ఉత్తమ నటుడిగా 2 అవార్డులతో పాటు వాన ప్రస్థానం సినిమాకు నిర్మాతగా మరో అవార్డును కూడా దక్కించుకున్నారు. ఇక కేరళ రాష్ట్ర అవార్డులు.. ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు సినీ రంగంలో చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ , పద్మభూషణ్ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కూడా సత్కరించింది. ఇకపోతే ఈయన భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.