BigTV English
Advertisement

OTT Movie : భూమిని తుడిచి పెట్టే మిస్టీరియస్ జంతువులు… హ్యుమానిటీ ఫైనల్ ఫైట్… ఒక్కో సీనుకూ గూస్ బంప్స్ పక్కా

OTT Movie : భూమిని తుడిచి పెట్టే మిస్టీరియస్ జంతువులు… హ్యుమానిటీ ఫైనల్ ఫైట్… ఒక్కో సీనుకూ గూస్ బంప్స్ పక్కా

OTT Movie : భూమి మీద ఏదైనా విపత్తు జరిగి మనుషులు అంతా చనిపోయి, ఏ కొద్ది మందో మిగిలితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. అయితే ఇలాంటి సంఘటలను మనం రియల్ గా అయితే ఇంత వరకు ఫేస్ చేయలేదు. ఇదైతే సంతోషించాల్సిన విషయమే. కానీ ఇలాంటి విపత్తులు సినిమాలలో మాత్రం ఊపిరి తీసుకోకుండా చేస్తుంటాయి. ఇలాంటి సినిమాలు ఇది వరకే చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్ ని పక్కాగా ఇస్తుంది. ఇక్కడ కొన్ని భయంకరమైన, వింత ఆకారంలో ఉండే జంతువులు మనుషుల్ని దారుణంగా చంపేస్తాయి. ఐదు పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంటారు. ఇక వీళ్ళు బతకడానికి చేసే పోరాటాలు యాక్షన్ సీన్స్ ని తలపిస్తుంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ఎలివేషన్’ (Elevation) 2024లో వచ్చిన పోస్ట్ అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. జార్జ్ నాల్ఫీ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో విల్ (అంతోనీ మాకీ), కేటీ (మాడీ హాసన్), నీనా (మోరెనా బాకరిన్), హంటర్ (డాన్నీ బాయ్డ్ జూనియర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 నవంబర్ 8న విడుదల అయింది. 2024 నవంబర్ 26 నుంచి HBO MAX, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఐయండిబిలో దీనికి 5.6/10 రేటింగ్ ఉంది.

 కథలోకి వెళ్తే 

భూమి మీద కొన్ని భయంకరమైన క్రీచర్స్ మానవులను 95% చంపేస్తాయి. అయితే ఈ క్రీచర్స్ 8,000 అడుగులు పైన జీవించలేవు. కాబట్టి మిగిలినవాళ్లు పర్వతాల్లో దాక్కుని ఉంటారు. ఈ కథలో విల్, అతని బెస్ట్ ఫ్రెండ్ కేటీ, నీనా అనే మరో మహిళతో కలిసి పర్వతాల్లో జీవిస్తారు. విల్ కొడుకు హంటర్‌ కి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అతనికి ఆక్సిజన్ ఫిల్టర్స్ కావాల్సి వస్తుంది. విల్, కేటీ, నీనా కలిసి, హంటర్‌కు మందులు తెచ్చుకోవడానికి 8,000 అడుగులు కింద బౌల్డర్ సిటీకి వెళ్తారు. ఈ ప్రయాణం చాలా డేంజరస్ గా ఉంటుంది. వీళ్ళను క్రీచర్స్ వెంబడిస్తాయి. విల్, కేటీ, నీనా క్రీచర్స్ నుంచి తప్పించుకుంటూ, మందులు తెచ్చుకోవడానికి ప్రయాణం చేస్తారు.


Read Also : హెర్బల్ మెడిసిన్‌తో పుట్టే అంతులేని వింత వ్యాధి… వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త జొంబీ హర్రర్ మూవీ

క్రీచర్స్ కూడా చాలా వేగవంతమైనవి. ఇవి 95% మానవులను చంపేశాయి. ఇప్పుడు వీళ్ళు ప్రతి స్టెప్‌లో భయం, యాక్షన్ సీన్స్ ఎదుర్కొంటారు. విల్ తన కుమారుడు హంటర్ కోసం ప్రాణాలు పనంగా పెట్టి పోరాడతాడు. కేటీ, నీనా కూడా అతనికి సపోర్ట్ చేస్తారు. విల్, కేటీ, నీనా మందులు తెచ్చుకోవడానికి క్రీచర్స్‌తో పెద్ద ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ లో వీళ్ళు క్రీచర్స్ నుంచి తప్పించుకుంటారా ? వీళ్ళకి మందులు దొరుకుతాయా ? హంటర్ సేఫ్ అవుతాడా ? ఈ క్రీచర్స్ ఎక్కడినుంచి వచ్చాయి ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

OTT Movie : ఏం సినిమా గురూ… బెడ్ రూమ్‌లో అలాంటి సీన్స్… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా

Idli Kottu OTT: ‘ఇడ్లీ కొట్టు’ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రిమింగ్‌, ఎక్కడంటే!

Lokah OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘ లోక’ … స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Arjun Chakravarthy OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన స్పోర్ట్స్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Big Stories

×