Rashi Singh: హీరోయిన్ రాశి సింగ్ ఇప్పుడిప్పుడే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
నాలుగేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఆమె, నటించిన నాలుగు సినిమాల్లో మూడు తెలుగులో చేసింది.
కాకపోతే సరైన గుర్తింపు రాలేదు. అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.
గతేడాది పాపం పసివాడు వెబ్ సిరీస్‌లో నటించింది.. అభిమానులను ఆకట్టుకుంది.
దీంతో క్రమంగా ఆఫర్లు రావడం మొదలుపెట్టింది.
గ్లామర్ ఇండస్ట్రీకి రాకముందు ఎయిర్ హోస్టెస్ గా పని చేసిన అనుభవం ఈమె సొంతం.
ఇప్పుడిప్పుడే అభిమానులను సొంతం చేసుకునే పనిలో పడింది.
వారికి ఆకట్టుకునేందుకు రకరకాలుగా ఫోటోషూట్లు ఇస్తోంది.
క్రిస్‌మస్ సందర్భంగా రాశి దిగిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.