Rohit Sharma – Yashasvi Jaiswal : బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ 2024 ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు మెల్ బోర్న్ వేదికగా నాలుగవ (బాక్సింగ్ డే) టెస్ట్ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కి టీమిండియా కేవలం ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమీన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్ కి దిగిన భారత బౌలర్లు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.
Also Read: 19 ఏళ్ల కుర్రాడితో గొడవ.. విరాట్ కోహ్లీపై నిషేధం ?
కానీ ఆస్ట్రేలియా కి మాత్రం అదిరిపోయే ఆరంభం దక్కింది. టాప్ ఆర్డర్ రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. సామ్ కాన్ స్టాన్ ఈ మ్యాచ్ లో వన్డే, టి20 తరహాలో ధనాధన్ బ్యాటింగ్ తో భారత బౌలర్లను ఉతికారేశాడు. 65 బంతులలో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్ లతో 60 పరుగులు చేసిన అతన్ని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎల్బిడబ్ల్యు చేసి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత లబుషేన్, ఉస్మాన్ ఖవాజా కలిసి ఆస్ట్రేలియా స్కోర్ ను ముందుకు నడిపించారు.
ఇక 7 బంతులు ఆడిన ట్రావీస్ హెడ్ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజాను 57 పరుగుల వద్ద బూమ్రా అవుట్ చేశాడు. కానీ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి క్రీజ్ లో పాతుకుపోయారు. లబుషేన్ ని 72 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. సెకండ్ సెషన్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించగా.. మూడో సెషన్ లో టీమిండియా జోరు కొనసాగింది. వరుస వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియా గేమ్ లోకి వచ్చింది.
ఈ సమయంలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు మరో ఛాన్స్ ఇవ్వొద్దని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ కట్టుదిట్టంగా ఫీల్డింగ్ అమలు చేశాడు. ఐతే మ్యాచ్ లో నిలకడగా రాణిస్తున్న లబుషెన్ – స్టీవ్ స్మిత్ జోడిని విడగొట్టేందుకు స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ ఏర్పాటు చేశాడు రోహిత్ శర్మ. అయితే ఫీల్డర్లు ఏదైనా తప్పు చేస్తే రోహిత్ శర్మ తనదైన శైలిలో సరదాగా మందలిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ పై రోహిత్ శర్మ కాస్త కోప్పడ్డాడు. బ్యాటర్ బాల్ ని ఆడకముందే జైస్వాల్ పదేపదే జంప్ చేస్తున్నాడు.
Also Read: Sam Konstas: బుమ్రా బౌలింగ్ లో తొలి సిక్స్ కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు…చరిత్రలో తొలిసారి!
ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ కి రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తూండగా అతడు ఓ బంతిని డిఫెన్స్ ఆడాడు. ఆ బంతి స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైష్వాల్ వద్దకు వెళ్ళింది. దీంతో ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నించని యశస్వి.. తనని తాను రక్షించుకునేందుకు పక్కకు జరిగాడు. ఇది గమనించిన రోహిత్ శర్మ వెంటనే సీరియస్ అయ్యాడు. ” ఓయ్ జైషు.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? అతడు బంతిని ఆడకముందే జంప్ చేస్తున్నావు. ఫీల్డింగ్ సరిగా చెయ్. అలా చేయకు. బంతిని ఆడే వరకు మోకాళ్లపైనే ఉండు” అని అరిచాడు. దీంతో రోహిత్ శర్మ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. అయితే రోహిత్ శర్మ సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"Are you playing Gully Cricket?"
Rohit Sharma's advice to Yashasvi Jaiswal at the Silly Point. #AUSvIND pic.twitter.com/ZYlSq6K6xs
— Cricket.com (@weRcricket) December 26, 2024